News April 3, 2024
నిర్మల్‌లో 43.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత

రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నిర్మల్ 43.5 డిగ్రీల జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో ఈ ఏడాదిలో 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం ఇదే తొలిసారి. జిల్లాలోని బైంసా మండలం వానల్ పాడ్, నర్సాపూర్ మండలంలో ఈ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Similar News
News March 1, 2025
‘ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి’

ఎలాంటి పొరపాట్లు, కాపీయింగ్‌కు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో సాఫీగా ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. శుక్రవారం అధికారులతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం,అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు
News February 28, 2025
రేపు ఆదిలాబాద్‌కు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి..

ఆదిలాబాద్‌లో శనివారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రేణుకా యారా పర్యటించనున్నారు. జిల్లా కోర్టులో డిస్పెన్సరీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 5 గంటలకు హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరి 10 గంటలకు ఆదిలాబాద్‌కు చేరుకుంటారు. ఉ. 10.30 జిల్లా కోర్టుకు రానున్నారు. అనంతరం మరుసటి రోజు ఆదివారం ఉదయం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.
News February 28, 2025
ఆదిలాబాద్: కనిపించకుండాపోయి.. శవమై తేలి

ఓ వ్యక్తి కనపడకుండా పోయి శవమై తేలిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. ఆదిలాబాద్ వన్ టౌన్ CI సునీల్ కుమార్ వివరాలు.. ఖానాపూర్‌కు చెందిన సాయికుమార్ (28) ఈనెల 22 నుంచి కనపడడం లేదని సోదరుడు గణేశ్ 25న ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదైంది. అయితే ఖానాపూర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోగా గురువారం శవమై కనిపించాడు. కుడి కన్నుకు ఆపరేషన్ కాగా కన్ను నుంచి నీరు, చీము కారుతుందని అది భరించలేక సూసైడ్ చేసుకున్నాడు.