News March 18, 2025
నిర్మల్ : అగ్ని వీర్ రిక్రూట్మెంట్‌కు దరఖాస్తులు

అగ్నిపథ్ స్కీం క్రింద అగ్ని వీర్ రిక్రూట్మెంట్ RTG 2025-26 కొరకు జిల్లాలోని అవివాహిత పురుషులు www.joinindianarmy.nic.in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని డీఐఈఓ పరశురాం తెలిపారు. మార్చి 12 నుంచి ఏప్రిల్ 10 వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరుగుతుందన్నారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్ లేదా స్టోర్ కీపర్, ట్రేడ్స్ మెన్, వంటి వివిధ కేటగిరీల్లో నియామకాలు జరుగుతాయని పేర్కొన్నారు.
Similar News
News November 7, 2025
రాష్ట్ర ఉత్తమ టీచర్‌గా బుట్టాయిగూడెం మాస్టారు

బుట్టాయిగూడెం జెడ్పీ హైస్కూల్ టీచర్ గుర్రం గంగాధర్‌కు అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్‌లో అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ సిస్టం విధానాన్ని అధ్యయనం చేయటానికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఆయన ఎంపికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 27 నుంచి వచ్చే నెల 2 వరకు వారం రోజులు పాటు ఈ కార్యక్రమం నిర్వహించనుంది. ఆయనను జిల్లా విద్యాశాఖ అధికారులు అభినందించారు.
News November 7, 2025
హైవేపై 10 కి.మీ రన్నింగ్ చేసిన గోరంట్ల మాధవ్

హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ శుక్రవారం ఉదయం రాయదుర్గం-అనంతపురం జాతీయ రహదారిపై రన్నింగ్ చేశారు. రాయదుర్గం నుంచి మారెంపల్లి వరకు సుమారు 10 కి.మీ దూరం ఆయన పరిగెత్తడం చూసి పలువురు ఆశ్చర్యానికి గురయ్యారు. గతంలో సీఐగా పనిచేసిన ఆయన ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. రాయదుర్గంలో ఓ వివాహ వేడుకకు వచ్చిన ఆయనను స్థానిక వైసీపీ నేత, వైస్ ఎంపీపీ అరుణ్ కుమార్ తదితరులు కలిసి ముచ్చటించారు.
News November 7, 2025
సంగారెడ్డి: వరి కోత మిషన్‌లో యువకుడి కాలు నుజ్జునుజ్జు

నారాయణఖేడ్ మండలం సంజీరావుపేట్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గురువారం రాత్రి వరి కోత కోస్తున్న యువకుడి కాలు హార్వెస్టర్ మిషన్ లోపల పడి నుజ్జునుజ్జయింది. వెంటనే రైతులు గమనించి బాధితుడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాలు తొలగించాల్సి ఉంటుందని వైద్యులు సూచించినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన తీరుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


