News March 31, 2025
నిర్మల్ అదనపు కలెక్టర్ సతీమణికి గ్రూప్-1లో స్టేట్ ర్యాంక్

గ్రూప్-1 ర్యాంకుల ఫలితాల్లో నిర్మల్ అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సతీమణి ప్రతిభ కనబరిచారు. టీజీపీఎస్సీ ఆదివారం విడుదల చేసిన గ్రూప్-1 పరీక్ష జనరల్ ర్యాంకింగ్‌లో అదనపు కలెక్టర్ సతీమణి బరిరా ఫరీద్ రాష్ట్రస్థాయిలో 68వ ర్యాంకు (బీసీఈ కేటగిరీలో మొదటి ర్యాంకు) సాధించారు. కాగా ఆమె ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ ఆఫ్ ఫార్మసీ డిగ్రీని పూర్తి చేశారు.
Similar News
News April 3, 2025
సిరాజ్‌పై సెహ్వాగ్ ప్రశంసలు

IPLలో సత్తా చాటుతున్న GT బౌలర్ సిరాజ్‌పై మాజీ క్రికెటర్ సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించారు. కొత్త బంతిని స్వింగ్ చేస్తూ వికెట్లు తీస్తున్నారని పేర్కొన్నారు. తిరిగి టీమ్ ఇండియాలో చోటు దక్కించుకోవాలనే కసితోనే ఆడుతున్నారని చెప్పారు. ఛాంపియన్స్ ట్రోఫీలో చోటు దక్కకపోవడం ఆయనను హర్ట్ చేసిందన్నారు. కాగా ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచుల్లో సిరాజ్ 5 వికెట్లు తీశారు.
News April 3, 2025
BREAKING.. గద్వాల: బాలుడి తల, మొండెం వేరైంది!

మల్దకల్ మండలంలో గురువారం తీవ్ర విషాదం నెలకొంది. మండలంలోని నీలిపల్లి గ్రామంలో తల్లిదండ్రుల వెంట ఎనిమిదేళ్ల జీవన్ వరి పొలం దగ్గరికి వెళ్లాడు. వారు వరికోత యంత్రంతో పొలంలో పనులు చేయిస్తున్నారు. బాలుడు ఆడుకుంటూ మిషన్ దగ్గరికి వెళ్లడంతో.. అది ఆ బాలుడి మీది నుంచి వెళ్లింది. దీంతో బాలుడి తల, శరీరం వేరై అక్కడికక్కడే మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.