News October 25, 2025

నిర్మల్: అద్భుత దృశ్యం.. ఆకాశం ముక్కలైనట్లుగా.!

image

నిర్మల్ జిల్లాలో అద్భుత దృశ్యం చోటుచేసుకుంది. సాయంత్రం ఆకాశం ముక్కలైనట్లు ఏర్పడిన ఈ అరుదైన మేఘాల పలకలు (ఆల్టోక్యుములస్ లేదా సిర్రోక్యుములస్ లాంటివి) ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకున్నాయి. ఎటు చూసినా గీతలు గీసినట్టుగా, అల్లినట్టుగా ఉన్న ఈ మేఘాలు కనువిందు చేశాయి. సాధారణంగా వర్షానికి ముందు కనిపించే ఈ ఆకారాలు వాతావరణ మార్పులకు సంకేతంగా నిలుస్తున్నాయి.

Similar News

News October 25, 2025

HYD: ఉస్మానియా ఆసుపత్రిలో టెలీ కమ్యూనికేషన్ సేవలు..!

image

ఉస్మానియా ఆసుపత్రి వేదికగా టెలీ కమ్యూనికేషన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. నిత్యం 80 నుంచి 100 మంది వరకు ఇది వినియోగించుకుంటున్నట్లుగా అధికారులు తెలియజేశారు. అర్బన్ ఆరోగ్య కేంద్రాల్లో కేవలం ప్రాథమిక వైద్య సేవల మినహా, ఏవైనా స్పెషాలిటీ అవసరమైతే, టెలీ సేవలను అందిస్తున్నారు. మధుమేహ, అధిక రక్తపోటు, కీళ్ల నొప్పులు తదితర సేవలు అందిస్తున్నారు.

జగిత్యాల: రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక దృష్టి: ఎస్పీ

image

జగిత్యాల జిల్లాలో రౌడీషీటర్ల కదలికలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడకుండా నిఘా పెంచారు. ప్రజలను ఇబ్బంది పెట్టే, తీరుమార్చుకోని వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లపై సమాచారం సేకరించి, అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.