News February 5, 2025
నిర్మల్: అధికారులకు కలెక్టర్ సూచనలు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. నిర్మల్, ఖానాపూర్, భైంసా, నర్సాపూర్ (జి) ఆసుపత్రుల్లో ఇప్పటివరకు జరిగిన సిజేరియన్, సాధారణ ప్రసవాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సురక్షితంగా ప్రసవాలు జరుగుతాయని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News February 6, 2025
రూ.80.15 కోట్ల లక్ష్యంతో స్వయం ఉపాధి: కలెక్టర్
జిల్లాలో వివిధ కార్పొరేషన్ల ద్వారా మొత్తం 4998 యూనిట్లకు రూ.80.15 కోట్ల లక్ష్యంతో స్వయం ఉపాధి అవకాశాలను అందించనున్నట్లు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. బుధవారం కడప కలెక్టరేట్లో వివిధ కార్పొరేషన్ల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు స్వయం ఉపాధి, రుణ సహాయ సంక్షేమ పథకాల అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. స్వయం ఉపాధి అవకాశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News February 6, 2025
KKD: డ్రోన్స్ వినియోగంపై పోలీసులకు శిక్షణ
కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న 97 మంది పోలీస్ హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లకు డ్రోన్స్ వినియోగంపై ఎస్పీ బిందు మాధవ్ శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న శిక్షణను ఎస్పీ పరిశీలించారు. శిక్షణ తీసుకున్న వారితో ఎస్పీ మాట్లాడారు. గతంలో సీసీ కెమెరాలు, ఇప్పుడు డ్రోన్స్ వినియోగంతో మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు.
News February 6, 2025
రోహిత్ పరుగుల దాహం తీరనుందా?
ఇంగ్లండ్‌తో రేపు వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రోహిత్ ఫ్యాన్స్ SMలో సందడి చేస్తున్నారు. గత 14 వన్డేల్లో హిట్‌మ్యాన్ రికార్డ్ స్థాయిలో రన్స్ చేశారని, అందులో సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నట్లు గుర్తుచేస్తున్నారు. అదే ఫామ్ కొనసాగించి పరుగుల వరద పారిస్తారని పోస్టులు పెడుతున్నారు. BGTలో ఇబ్బంది పడిన రోహిత్ ఇంగ్లండ్‌పై పరుగుల దాహం తీర్చుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీ COMMENT.