News February 12, 2026
నిర్మల్: అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు ‘తడిసి మోపెడు’

నిర్మల్ జిల్లాలోని 80 వార్డుల్లో పోటీ చేసిన అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు భారంగా మారింది. గెలుపు కోసం ఫ్లెక్సీలు, ప్రచారం, మద్యం పంపిణీతో పాటు ఓటుకు నోటు ఇవ్వడంతో ఖర్చు భారీగా పెరిగింది. అధికారులకు చూపే లెక్కలు ఒకలా ఉంటే, క్షేత్రస్థాయిలో అభ్యర్థులు చేసిన వాస్తవ వ్యయం మరోలా ఉండటం గమనార్హం. ఎలాగైనా కౌన్సిలర్‌గా గెలవాలన్న పట్టుదలతో అభ్యర్థులు తమ శక్తికి మించి ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
Similar News
News April 4, 2026
TU: పరీక్ష ఫీజు చెల్లించేందుకు నేడే లాస్ట్

TU పరిధిలోని డిగ్రీ (BA/B.Com/B.Sc/BBA) విద్యనభ్యసించే రెగ్యులర్ 2, 4, 6 సెమిస్టర్ల, 1, 3, 5 బ్యాక్ లాగ్ (2021 నుంచి 2025 వరకు) విద్యార్థులు పరీక్షల ఫీజు చెల్లించేందుకు నేడే చివరి తేదీ అని COE ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. అపరాధ రుసుము రూ.100తో ఈ నెల 6 వరకు అవకాశముందన్నారు. ఈ నెల 18 నుంచి పరీక్షల షెడ్యూల్ సైతం ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థులు తప్పకుండా పరీక్ష ఫీజులు చెల్లించాలన్నారు.
News April 4, 2026
ముందస్తు బడిబాట.. విద్యార్థుల సంఖ్య పెంపే లక్ష్యం!

పీఎంశ్రీ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలో 31 పీఎంశ్రీ పాఠశాలలు ఉన్నాయి. ఉపాధ్యాయులు ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో బోధన ఉచిత, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్బుక్కులు, మధ్యాహ్న భోజనం, యూనిఫామ్స్ ఇస్తున్నారని, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు బోధన చేస్తున్నారని చెబుతున్నారు.
News April 4, 2026
శ్రీ తిరుపతమ్మ దేవస్థానానికి నోటీసులు

పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ ఆలయానికి రూ. 8.90 లక్షలు ఇంటి పన్ను చెల్లించాలని గ్రామపంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేశారు. 3 ఏళ్లుగా దేవస్థానంలో ఉన్న వివిధ రకాల భవనాలకు ఇంటి పన్ను పెండింగ్లో ఉంది. పంచాయతీ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు 4 రోజులుగా ఆయజ అధికారుల చుట్టూ తిరిగినా స్పందించలేదు. నోటీసులు తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో పంచాయతీ అధికారులు చేసేదేమీ లేక కార్యాలయం గోడకు అంటించారు.


