News April 22, 2025
నిర్మల్: ‘అమ్మానాన్న కష్టం చూడలేక ఆర్మీ జాబ్ కొట్టాడు’

బైంసా మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సాకేత్ మొదటి ప్రయత్నంలోనే ఆర్మీ ఫలితాల్లో ఉద్యోగం సాధించాడు. తల్లిదండ్రులు వ్యవసాయం, కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. తన అమ్మానాన్నల కష్టాన్ని చూసి ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే కృషితో పట్టుదలతో మొదటి ప్రయత్నంలోనే ఆర్మీ ఉద్యోగం సాధించాడు. కానిస్టేబుల్ కృష్ణ చౌహాన్‌ను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఉద్యోగం పొందానని తెలిపాడు. అతడినిని పలువురు అభినందించారు.
Similar News
News December 13, 2025
పల్నాడు: మల్లమ్మ సెంటర్‌కు ఆపేరు ఎలా వచ్చిందో తెలుసా..!

నరసరావుపేటలోని మల్లమ్మ సెంటర్ అంటే తెలియని వారు ఉండరు. వినుకొండ, సత్తెనపల్లి, పల్నాడు, గుంటూరు వెళ్లే 4 మార్గాలను కలిపే కూడలిని మల్లమ్మ సెంటర్ అంటారు. ఈ కూడలిలో చందనం మల్లమ్మ 1945లో మిఠాయి దుకాణం ప్రారంభించారు. ఆమె చేసిన మిఠాయిని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీసుకెళ్లటంతో మల్లమ్మ షాపు ప్రజలకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత పెద్ద బజారుగా ఉన్న ఆ కూడలికి 1970 నుంచి మల్లమ్మ సెంటర్‌గా వాడుకలోకి వచ్చింది.
News December 13, 2025
తిరుపతిలో మరో 4 స్టార్ హోటల్

తిరుపతిలో ‘హిల్‌టన్ గార్డెన్ ఇన్’ పేరిట 4-స్టార్ హోటల్ నిర్మించనున్నారు. నాంది హోటల్స్ సంస్థ రూ.149.65 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్ చేపట్టనుంది. 222 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభించనున్నాయి. కంపెనీకి 10 ఏళ్లు 100% నికర SGST రీఫండ్, స్థిర మూలధన పెట్టుబడిలో 10% (గరిష్ఠంగా ₹10 కోట్లు) ప్రోత్సాహకం అందించనున్నారు. స్టాంప్ డ్యూటీ, విద్యుత్ డ్యూటీ రీఫండ్ ఇస్తారు. అక్కారంపల్లిలో దీనిని నిర్మిస్తారు.
News December 13, 2025
ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు.. తెలంగాణకు సున్నా

PMAY-G కింద FY25-26 నిధులలో TGకి నయాపైసా కూడా కేటాయించలేదు. ఈ పథకం కింద 4 ఏళ్లలో మొత్తం ₹1,12,647.16CR విడుదల చేస్తే TGకి, WBకి పైసా రాలేదు. APకి ₹427.6CR వచ్చాయి. BJP పాలిత రాష్ట్రాలు, బిహార్ వంటి కొన్ని NDA అధికారంలో ఉన్న స్టేట్స్‌కే అత్యధిక వాటా దక్కింది. అలాగే ఎన్నికలు జరగనున్న TN, కేరళ వంటి రాష్ట్రాలకు నిధుల కేటాయింపులయ్యాయి. MH కాంగ్రెస్ MP వేసిన ప్రశ్నకు కేంద్రం ఈ వివరాలు వెల్లడించింది.


