News February 6, 2026

నిర్మల్: అవకాశమే హద్దు.. ప్రచారంలో వినూత్నం

image

మున్సిపల్ ఎన్నికల గడువు సమీపిస్తోన్న కొద్ది పొలిటికల్ హిట్ పెరిగిపోతుంది. గంపగుత్తగా ఒకే చోట ఓటర్లను కలుస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేసుకునే పనిలో పార్టీలు నిమగ్నమయ్యాయి. అయితే నిర్మల్ పట్టణంలో శుక్రవారం మైనార్టీ సోదరులు నమాజ్ ముగించుకుని బయటకు వచ్చేసరికి తమ పార్టీకి ఓటు వేసి మున్సిపల్ పీఠంపై జెండా ఎగిరేలా మీ సహకారం అందించాలని BRS నేతలు కోరారు.

Similar News

News February 11, 2026

సంగారెడ్డి: ఓట్ల లెక్కింపుపై 12 శిక్షణ

image

జిల్లాలో ఈనెల 13న నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నిర్వహణపై ఈనెల 12 సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ప్రావీణ్య కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ఓట్ల లెక్కింపునకు విధులు కేటాయించిన అధికారులు సూచించిన మున్సిపల్ కేంద్రాల్లో ఈ శిక్షణకు హాజరు కావాలని సూచించారు.

News February 11, 2026

ఇక్కడ స్నానం చేస్తే పాపాలు పోతాయట

image

ఒడిశాలోని బింకా సమీపంలో మహానది తీరాన ఉన్న పాపాక్షయ ఘాట్‌కు 900 ఏళ్ల చరిత్ర ఉంది. బ్రాహ్మణ హత్య దోషంతో బాధపడిన అనంగ భీమదేవుడు ఇక్కడ స్నానం చేసి విముక్తి పొందాడని కథనం. ఓ ఆవు స్వయంగా పాలిచ్చిన చోట రాజు కపిలేశ్వర శివాలయాన్ని నిర్మించాడు. ఇక్కడి మహానదిలో స్నానం చేసి, శివుడిని దర్శించుకుంటే పాపాలు తొలగి మనశ్శాంతి కలుగుతుందని విశ్వాసం. ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండే ఈ ఘాట్‌కు ఏటా ఎంతో మంది వస్తుంటారు.

News February 11, 2026

విజయవాడకు ఉపాధికి వచ్చారా..ఈ ఉచిత వసతి మీకోసమే

image

ఉపాధి కోసం విజయవాడ వచ్చిన నిరుద్యోగులకు వీఎంసీ-మెప్మా సంయుక్తంగా కలిచి ఉచిత వసతిని కల్పిస్తోంది. ఆధార్ కార్డు ఉంటే పైసా చెల్లించినవసరం లేకుండానే ఆశ్రయాన్ని ఇవ్వనుంది. వీరికి కోసం విద్యాధరపురం, రాణిగారితోట, గాంధీనగర్, వెహికల్ డిపో ప్రాంతాల్లో హాస్టల్స్‌ను ఏర్పాటు చేసింది. భోజన వసతి, టీవీ బెడ్ తదితర సౌకర్యాలను అందిస్తోంది.