News February 26, 2025

నిర్మల్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్ ఉద్యోగాలు

image

నిర్మల్ ఆర్టీసీ డిపోలో కాంట్రాక్టు విధానంలో పని చేయడానికి డ్రైవర్లు కావాలని నిర్మల్ డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి తెలిపారు. హెవీ లైసెన్స్ ఉండి బ్యాడ్జి నెంబర్ ఉన్న 18 నెలల అనుభవం కల డ్రైవర్లు కావాలని చెప్పారు. వరంగల్‌లోని ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్‌లో 15 రోజుల శిక్షణ ఇచ్చి విధుల్లోకి తీసుకుంటామని పేర్కొన్నారు. నెలకు జీతం రూ.24 వేలు ఉంటుందని, ఆసక్తి గలవారు డిపోలో సంప్రదించాలని సూచించారు.

Similar News

News February 26, 2025

ప్రధాని మోదీకి సీఎం రేవంత్ వినతులివే

image

☛ HYDలో మెట్రో రైల్ ఫేజ్‌-IIకు అనుమ‌తించాలి
☛ RRR ఉత్త‌ర భాగంలో 90% భూ సేక‌ర‌ణ పూర్త‌యినందున ద‌క్షిణ భాగాన్ని మంజూరు చేయాలి
☛ RRRకు స‌మాంత‌రంగా రీజిన‌ల్ రింగ్ రైలు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలి
☛ మూసీ ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్ల సాయం
☛ గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుకు 222.7ఎక‌రాల ర‌క్ష‌ణ భూముల బ‌దిలీకి సహకారం
☛ TGకి అదనంగా 29 IPS పోస్టులు మంజూరు చేయాలి
☛ సెమీ కండ‌క్ట‌ర్ల ప‌రిశ్ర‌మ ఏర్పాటు చేయాలి

News February 26, 2025

‘ది పారడైజ్’లో బోల్డ్ & వైల్డ్‌‌గా నానీ!

image

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తోన్న ‘ది పారడైజ్’ నుంచి మార్చి 3న ‘RAW STATEMENT’ వీడియో రిలీజ్ కానుంది. దీని ఎడిట్ పూర్తయిందని, ఇందులో నాని బోల్డ్‌గా, వైల్డ్‌గా కనిపించనున్నారని & అనిరుధ్ మ్యూజిక్ అదిరిందని మేకర్స్ పేర్కొన్నారు. దీంతో ఈ వీడియోపై అభిమానుల్లో ఎక్స్‌పెక్టేషన్స్ భారీగా పెరిగిపోయాయి. కాగా మొన్న రిలీజైన ‘HIT-3’ టీజర్‌లోనూ నానీని వైల్డ్‌గా చూపించారు.

News February 26, 2025

కీసరలో రోడ్డు ప్రమాదం.. అన్నదమ్ములు మృతి

image

కీసర PS పరిధిలోని యాదగిరిపల్లిలో ORR సర్వీస్ రోడ్‌ మీద ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాలు.. గూడూరు చంద్రశేఖర్ (32), మత్స్యగిరి (27) అన్నదమ్ములు. శ్రీను అనే మరో వ్యక్తితో బైక్‌పై బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి వస్తుండగా ORR సర్వీస్ రోడ్‌లో ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. చంద్రశేఖర్ అక్కడిక్కడే చనిపోయాడు. మత్స్యగిరి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, మార్చి 20న మత్స్యగిరి వివాహం జరగాల్సి ఉంది.

error: Content is protected !!