News March 20, 2025

నిర్మల్: ఆ గురువులే కీచకులు

image

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన కొందరు ఉపాధ్యాయులే విద్యార్థుల పట్ల కీచకంగా మారుతున్నారు. నిర్మల్(D) నర్సాపూర్ (జి)లో గణిత ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించి అరెస్టు అయ్యాడు. విద్యార్థినుల తల్లిదండ్రులు వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల జడ్పీ స్కూల్, సాయికుంట ఆశ్రమ పాఠశాల, భీమిని పాఠశాలలో కూడా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

Similar News

News March 20, 2025

వనపర్తి: ఈ యాప్ డౌన్లోడ్ చేశారంటే మీ అకౌంట్ ఖాళీ: పోలీసులు 

image

వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం తాడిపర్తి గ్రామ వాట్సాప్ గ్రూపులో పీఎం కిసాన్ నిధి యోజన అనే APK డాక్యుమెంట్ వాట్సాప్ గ్రూప్‌లో రావడంతో కొందరు యువకులు డాక్యుమెంట్ డౌన్లోడ్ చేయగా వారి ఫోన్ హ్యాకింగ్ గురై వాట్సాప్ గ్రూపులన్నింటికీ APK ఫార్వర్డ్ అవుతుంది. కావున పీఎం కిసాన్ యోజన్ అంటూ మెసేజ్ వస్తే దాన్ని ఓపెన్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

News March 20, 2025

పారిశ్రామిక విధానాలపై ప.గో అధికారులకు అవగాహన 

image

స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కలల సాకారంలో భాగంగా ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల రీసైక్లింగ్ పరిశ్రమల స్థాపనకు ఔత్సాహికవేత్తలు కృషి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమలు,ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన వివిధ పారిశ్రామిక విధానాల గురించి అధికారులకు అవగాహన కల్పించారు.

News March 20, 2025

ఒకే ఫ్రేమ్‌లో కెప్టెన్లు

image

ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద ఐపీఎల్ 2025 ట్రోఫీని ఆవిష్కరించారు. ఐపీఎల్ ట్రోఫీతో అన్ని జట్ల కెప్టెన్లు గ్రూప్ ఫొటో దిగారు. కెప్టెన్లు కమిన్స్, అయ్యర్, గిల్, పంత్, రుతురాజ్, హార్దిక్, పాటిదార్, శాంసన్, రహానే, అక్షర్ పటేల్ ఫొటోషూట్‌లో సందడి చేశారు. కాగా ఎల్లుండి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. 65 రోజులపాటు జరిగే ఈ మెగా టోర్నీలో మొత్తం 74 మ్యాచులు జరగనున్నాయి.

error: Content is protected !!