News January 9, 2026

నిర్మల్: ఇంటర్ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలి

image

ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర బోర్డు పరీక్షల నిర్వహణపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

Similar News

News February 9, 2026

‘SIR’కు అడ్డంకులు సృష్టించొద్దు.. సుప్రీంకోర్టు హెచ్చరిక

image

‘SIR’ ప్రక్రియను వ్యతిరేకిస్తూ WB ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై SC కీలక వ్యాఖ్యలు చేసింది. ‘సర్‌’ ప్రక్రియలో అడ్డంకులు సృష్టించొద్దని హెచ్చరించింది. మరోవైపు 300 మంది అధికారులను కోరితే ప్రభుత్వం 80 మందిని మాత్రమే ఇచ్చిందని EC కోర్టుకు తెలిపింది. స్థానికతను నిరూపించుకోవడానికి ఓటర్లకు ఈసీ ఒక్క అవకాశమూ ఇవ్వలేదని ప్రభుత్వం వాదించింది. దీంతో గడువును వారం రోజులపాటు పొడిగిస్తున్నట్లు SC తెలిపింది.

News February 9, 2026

రావులపాలెం: టీ తాగడానికి వెళ్తే మృత్యువు కబళించింది

image

రావులపాలెం మండలం ఊబలంకలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బండారు వెరయ్య (79) మృతి చెందాడు. టీ తాగడానికి వచ్చిన వృద్ధుడిని రావులపాలెం నుంచి ఆత్రేయపురం వెళ్తున్న లారీ అతివేగంగా ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. మృతుని కుమారుడు బండారు వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI కేవీ రమణారెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

News February 9, 2026

విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలి: కలెక్టర్

image

హన్మకొండ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్‌లో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్యను కలెక్టర్ స్నేహశబరీష్ ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ నివేదిక అందజేయాలని సూచించారు. టెన్త్ విద్యార్థులకు పరీక్షల సమయం దగ్గరపడుతోందని ఆరోగ్యంగా ఉంటేనే చదువులో రాణిస్తారని చెప్పారు.