News March 5, 2025
నిర్మల్: ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీ

నిర్మల్ పట్టణంలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, బుధవారం సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు గురించి ఆరా తీశారు. సీసీ కెమెరాల నడుమ నిబంధనలకు అనుగుణంగానే పరీక్షలు నిర్వహిస్తున్నారా లేదా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట జిల్లా ఇంటర్మీడియట్ అధికారి పరశురాం తదితరులు ఉన్నారు.
Similar News
News February 26, 2026
మంచిర్యాల: బ్రెజిల్‌లో మైనింగ్‌కు సింగరేణికి ఆహ్వానం

లిథియం మైనింగ్‌లో సింగరేణి సంస్థ భాగస్వామిగా చేరాలని బ్రెజిల్ దేశానికి చెందిన ప్రముఖ సీబీఎల్ సంస్థ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కోరింది. సింగరేణి ఛైర్మన్, ఎండీ డాక్టర్ బుద్దప్రకాశ్ జ్యోతిని కలిసి వివరాలను వెల్లడించారు. సింగరేణి సంస్థ కీలక ఖనిజాల పట్ల ఆసక్తితో ఉన్న నేపథ్యంలో తమ కంపెనీలో భాగస్వామిగా చేరితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వారు వివరించారు.
News February 26, 2026
చరిత్రలో ఈరోజు (ఫిబ్రవరి 26)

1802- ఫ్రెంచి నవలా రచయిత విక్టర్ హ్యూగో జననం
1829- బ్లూ జీన్స్‌ని రూపొందించిన లెవీ స్ట్రాస్ అండ్ కో ఫౌండర్ లెవీ స్ట్రాస్ జననం
1932- సామాజిక కార్యకర్త హేమలతా లవణం జననం
1982- మాజీ క్రికెటర్ వేణుగోపాలరావు పుట్టినరోజు
1887- పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన తొలి భారతీయ మహిళా వైద్యురాలు ఆనందీబాయి జోషి మరణం
1962- ఉమ్మడి ఏపీ శాసనసభ మొదటి స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు మరణం(ఫొటోలో)
News February 26, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.


