News February 5, 2025
నిర్మల్: ఇద్దరు ఉపాధ్యాయులపై పోక్సో కేసు: SI

నర్సాపూర్(జి) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న <<15345603>>ఉపాధ్యాయులపై<<>> పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయికిరణ్ బుధవారం తెలిపారు. జిల్లా చైల్డ్ వెల్ఫేర్ శాఖ సూపర్వైజర్ ఫిర్యాదు చేయడంతో మోహన్ రావ్, మనోహర్ రెడ్డిలపై కేసు నమోదు చేశామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని ఎస్సై పేర్కొన్నారు.
Similar News
News November 6, 2025
వేములవాడ: 16వ రోజు కొనసాగుతున్న కార్తీక దీపోత్సవం

వేములవాడ రాజన్న క్షేత్రంలో దీపోత్సవ కార్యక్రమం 16వ రోజు గురువారం ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా నిత్యం ఆలయాల ఆవరణలో దీపోత్సవం నిర్వహించాలని దేవాదాయ శాఖ జారీ చేసిన ఆదేశాల మేరకు భీమేశ్వరాలయం ఆవరణలో కార్తీక దీపాలను వెలిగించారు. ఆలయ ఏఈవో అశోక్ కుమార్ దీపోత్సవ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
News November 6, 2025
అన్ని కార్యాలయాల్లో రేపు సామూహిక వందేమాతరం

బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గేయాలని 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 7 జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో సామూహిక గీతాలాపన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉదయం 10 గంటలకు వందేమాతర గీతాన్ని సామూహికంగా ఆలపించాలని కలెక్టర్ సూచించారు.
News November 6, 2025
‘ఉచితం, తక్కువ లాభం’ అంటే మోసమే: ఏసీపీ

సైబర్ నేరాల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సిద్దిపేట సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏసీపీ శ్రీనివాస్ సూచించారు. సైబర్ జాగృతి దివస్ సందర్భంగా సిద్దిపేట మెడికల్ కళాశాల విద్యార్థులకు గురువారం అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్లు ఆశ, భయం పేరుతో భయపెడుతూ, మభ్యపెడుతున్నారని, జాగ్రత్తగా ఉండాలన్నారు. ఉచితం లేదా తక్కువ సమయంలో ఎక్కువ లాభం వస్తుందంటే అది మోసమే అని గ్రహించాలని ప్రజలకు ఏసీపీ సూచించారు.


