News April 16, 2025

నిర్మల్: ఈ వాహనమే ప్రాణం తీసింది

image

దిలావర్పూర్ మండల సిర్గాపూర్ సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. ఇందులో మహారాష్ట్రకు చెందిన రాజు (45)అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన కొడుకు కేదారనాథ్ అస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. మొదట్లో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టినట్లు కేసు నమోదుచేసిన పోలీసులు తర్వాత సీసీపుటేజీలను పరిశీలించి వాహనాన్ని గుర్తించారు.

Similar News

News April 16, 2025

గుంటూరు: సినిమాలో నటిస్తున్న ఎమ్మెల్యే

image

పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు సినిమాలో నటిస్తున్నారు. ఆయన నటిస్తున్న ప్రధాన పాత్ర వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని దర్శకులు దిలీప్ రాజా చెప్పారు. ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌ను ప్రకటించారు. సినిమా పూర్తిస్థాయి కమర్షియల్‌గా ఉంటుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉండాలో ఈ సినిమాలో చూపిస్తామన్నారు. దర్శకులు నరేశ్ దోనే, మణివరణ్ ఉన్నారు.

News April 16, 2025

కరీంనగర్ జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రత

image

కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర, చిగురుమామిడి, రామడుగు మండలాల్లో 42.2°C నమోదు కాగా, శంకరపట్నం 41.8, గన్నేరువరం 41.7, జమ్మికుంట 41.4, మానకొండూర్ 40.9, కరీంనగర్ రూరల్, చొప్పదండి 40.7, తిమ్మాపూర్ 40.4, వీణవంక 40.3, కరీంనగర్ 40.2, హుజూరాబాద్ 40.0, కొత్తపల్లి 39.9, సైదాపూర్ 39.6, ఇల్లందకుంట 39.1°C గా నమోదైంది.

News April 16, 2025

అక్రమ వలసదారులకు ట్రంప్ ఆఫర్

image

USలో చట్టవిరుద్ధంగా ఉంటూ సెల్ఫ్ డిపోర్టేషన్ (స్వీయ బహిష్కరణ) చేసుకునే వారికి ట్రంప్ ఆఫర్ ప్రకటించారు. సాధారణ పౌరులు తమ సొంత దేశానికి వెళ్లేందుకు విమాన ఖర్చులతో పాటు కొంత నగదు ఇస్తామని తెలిపారు. అలా వెళ్లిన వారిలో మంచివారుంటే చట్ట పద్ధతిలో వెనక్కి తిరిగిరావడానికి అనుమతిస్తామన్నారు. US నుంచి అక్రమ వలసదారులను వెనక్కి పంపడమే ప్రథమ లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు.

error: Content is protected !!