News March 30, 2025
నిర్మల్: ఉగాది పర్వదినం.. ఖరీఫ్ సాగుకు శ్రీకారం

రైతులు పవిత్రంగా జరుపుకునే ఉగాది రోజునే ఖరీఫ్ సాగుకు శ్రీకారం చుడతారు. తెల్లవారుజామునే స్నానాలు చేసి అరకతో పంట భూమికి వెళ్లి అక్కడ భూమాతకు ప్రత్యేక పూజలు చేస్తారు. వెంట తీసుకెళ్లిన పెరుగన్నం నైవేద్యంగా పెడతారు. అనంతరం అరకతో కనీసం 5 సాళ్లను దున్నుతారు. చేలో ఉన్న చెత్త, చెదారాన్ని పోగుచేసి నిప్పు పెట్టి తిరిగి ఇంటికి వస్తారు. మళ్లీ సాయంత్రం మరోసారి వెళ్లి పూజలు చేసి వస్తారు.
Similar News
News March 1, 2026
నిజామాబాద్: జిల్లా ప్రజలకు సీపీ కీలక సూచనలు

నిజామాబాద్ జిల్లా ప్రజలకు సీపీ సాయిచైతన్య కీలక సూచనలు చేశారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే ప్రాంతాల్లో విగ్రహ ప్రతిష్ఠలు నిషేధించినట్లు చెప్పారు. రాత్రి 10 గం.ల నుంచి ఉదయం 6 గం.ల వరకు డీజేలు వాడకూడదన్నారు. భారీ సభలకు, డ్రోన్ల వినియోగానికి ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. ఈ నిబంధనలు మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు అమలులో ఉంటాయన్నారు.
News March 1, 2026
నేడు విండీస్‌తో ఢీ.. ఈ’డెన్’ కలిసొస్తుందా?

T20WC: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా నేడు భారత్-విండీస్ తలపడనున్నాయి. సెమీస్ చేరాలంటే భారత్ తప్పక గెలవాల్సిన మ్యాచ్ ఇది. అయితే 1983 నుంచి ఈడెన్‌లో భారత్‌ను విండీస్ ఎప్పుడూ ఓడించలేకపోయింది. భారత్ చేతిలో నాలుగు T20I సహా తొమ్మిది మ్యాచ్‌లు ఓడిపోగా మరో రెండు డ్రా అయ్యాయి. ఇక 2016 టీ20 ప్రపంచకప్ తర్వాత విండీస్ ఎప్పుడూ సెమీస్ చేరలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.
News March 1, 2026
కర్నూలు: మత్తు పదార్థాలపై ఉక్కుపాదం.. కలెక్టర్ ఆదేశం!

కర్నూలు జిల్లాలో మత్తు పదార్థాల రవాణా, వినియోగాన్ని అరికట్టాలని కలెక్టర్ డా.ఏ సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని NCORD సమావేశంలో మాట్లాడుతూ.. విద్యాసంస్థల వద్ద నిఘా పెంచాలని, RTC బస్సుల్లో అక్రమ రవాణా జరగకుండా చూడాలన్నారు. జనవరి నుంచి జిల్లాలో 2 కేసులు నమోదు చేసి 1.350 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి సాగుపై నిఘా ఉంచాలని రెవెన్యూ, పోలీసు శాఖలను కలెక్టర్ ఆదేశించారు.


