News May 8, 2024

నిర్మల్: ఉద్యోగాల పేరిట బురిడీ

image

ఉద్యోగాలు ఇప్పిస్తానని యువకులను ఓ మహిళ మోసం చేసిన ఘటన నిర్మల్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏజెన్సీ ద్వారా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక్కొక్కరి నుంచి రూ. 2-10లక్షల వరకు వసూలు చేసింది. ఆమె ఇచ్చిన ఆర్డర్ కాపీలతో ఉద్యోగాల్లో చేరేందుకు వెళ్లగా జరిగిన మోసం తెలుసుకున్నారు. డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే నకిలీ చెక్కులు రాసిచ్చి తప్పించుకుని తిరుగుతోందని బాధితులు వాపోతున్నారు.

Similar News

News January 18, 2025

ADB: ఉచిత శిక్షణకు దరఖాస్తులు.. APPLY NOW

image

రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్ ద్వారా ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధిస్ట్, పార్శి అభ్యర్థులకు గ్రూప్-1,2,3,4, RRB, SSC, బ్యాంకింగ్ మొదలైన పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆదిలాబాద్ DMWO రాజలింగు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 15 లోపల మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.  నాలుగు నెలల బేసిక్ ఫౌండేషన్ కోర్సు ఇస్తామని.. అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News January 18, 2025

ADB: కాంగ్రెస్ గెలుపునకు సమన్వయంతో పనిచేయాలి: సీతక్క

image

ఇచ్చోడ మండలంలోని స్థానిక గార్డెన్‌లో మంత్రి సీతక్క అధ్యక్షతన జిల్లా ముఖ్య నాయకుల సమావేశం శుక్రవారం రాత్రి నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సమన్వయంతో కలిసి కట్టుగా పనిచేసి పార్టీ గెలుపునకు కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి సీతక్క సూచించారు.

News January 18, 2025

MNCL: తప్పుడు అఫిడవిట్‌లు సమర్పిస్తే చర్యలు : CP

image

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పాస్‌పోర్ట్, ఉద్యోగ నియామకాలు, విదేశాలకు వెళ్లేందుకు పోలీస్ కేసులు లేవని క్లియరెన్స్ నిమిత్తం తప్పుడు అఫిడవిట్‌లు సమర్పించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని సీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. పోలీస్ వెరిఫికేషన్, క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం కొంతమంది గతంలో కేసులు నమోదైన తప్పుడు అఫిడవిట్‌లు సమర్పిస్తున్నట్లు తెలిపారు.