News February 23, 2025
నిర్మల్: ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులంతా తమ విధుల పట్ల తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. మాస్టర్ ట్రైనర్లు అధికారులకు ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలో, ఎన్నికల తర్వాత నిర్వహించవలసిన విధులపై అధికారులకు శిక్షణ ఇచ్చారు.
Similar News
News December 3, 2025
రైతుల ఖాతాల్లో రూ.7,887కోట్లు జమ: ఉత్తమ్

వరి సేకరణలో TG అగ్రస్థానంలో కొనసాగుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ‘ఇప్పటివరకు 41.6 లక్షల టన్నుల ధాన్యం సేకరించాం. 48hrsలో ₹7,887Cr చెల్లించాం. 8,401 PPCలలో 7.5 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. సన్న రకాలకు ₹314Cr బోనస్ చెల్లించాం. అటు APలో ఇప్పటివరకు 11.2L టన్నులు సేకరించారు. 1.7లక్షల మందికి రూ.2,830Cr చెల్లించారు. AP కంటే TG స్కేల్ 4 రెట్లు ఎక్కువ’ అని ట్వీట్ చేశారు.
News December 3, 2025
మంచిర్యాల: ఎన్నికల రోజు సెలవు

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పోలింగ్ కార్యచరణ ప్రకారం సెలవులు ఖరారు చేసినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. పోలింగ్ ముందు రోజు పోలింగ్ కోసం ఉపయోగించే ప్రభుత్వ భవనాలు, పాఠశాల భవనాలకు ప్రభత్వ సెలవు ప్రకటించామన్నారు. పోలింగ్ రోజు ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర ఉద్యోగులకు స్థానిక సెలవు ప్రకటించినట్లు ఆయన వెల్లడించారు.
News December 3, 2025
కోనసీమ జిల్లాలో ధాన్యం కొనుగోలుపై జేసీ సమీక్ష

కోనసీమ జిల్లాలో అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ నిశాంతి అధికారులు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమి స్తోందని, ఖరీఫ్ సీజన్(2025-26)కు సంబంధించి అత్యంత పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఉండాలన్నారు.


