News January 15, 2026
నిర్మల్: ఓటర్ల లెక్క కొలిక్కి.. ఇక మొదలెడదామా

నిర్మల్ జిల్లాలోని నిర్మల్, బైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో ఎన్నికల సందడి మొదలైంది. మొత్తం 1,67,015 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈనెల 17 లేదా 18న నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అగ్రనేతలు గెలుపు గుర్రాల వేటలో నిమగ్నమయ్యారు. అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు.
Similar News
News April 13, 2026
అనకాపల్లి: ప్రేమ పేరుతో మోసం.. CISF కానిస్టేబుల్ అరెస్ట్

పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని మోసం చేసిన కేసులో CISF కానిస్టేబుల్ కె.రాజీవ్ గాంధీని అరెస్ట్ చేసినట్లు అనకాపల్లి సీఐ ప్రేమ్ కుమార్ ఆదివారం తెలిపారు. చీడికాడ మండలానికి చెందిన కానిస్టేబుల్ చోడవరం మండలానికి చెందిన యువతిని అనకాపల్లిలో తన అక్క ఇంటిలో ఉంచి ఆమెను కలిసేవాడు. పెళ్లి విషయం ప్రస్తావించగా నిరాకరించడంతో బాధితురాలు ఫిర్యాదు మేరకు యూపీలో పని చేస్తున్న కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేశామన్నారు.
News April 13, 2026
మచిలీపట్నం-విజయవాడ హైవేపై ప్రమాదం.. స్పాట్ డెడ్, కారు నుజ్జు

మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిపై ఉయ్యూరు వద్ద ఉన్న జియో పెట్రోల్ బంక్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున పెను ప్రమాదం సంభవించింది. కానూరుకు చెందిన కారు అదుపుతప్పి ప్రమాదానికి గురవడంతో ప్రయాణికుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా, మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
News April 13, 2026
HYD: నేడు ఈ రూట్లో NO ENTRY

ఉప్పల్‌లో నేడు జరిగే IPL మ్యాచ్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఉప్పల్ రింగ్ రోడ్డులో భారీ వాహనాలకు నో ఎంట్రీ. లారీలు, డంపర్లు, ట్రక్కులు, టిప్పర్లు, ఎర్త్ మూవర్స్, వాటర్ ట్యాంకర్లు, RMC వాహనాలు, JCBలు, ఐచర్ వ్యాన్లు, ప్రైవేట్ బస్సులు, ట్రాక్టర్ల రాకపోకలు నిషేధించారు. డైవర్షన్ మార్గాలు వినియోగించాలని పోలీసులు సూచించారు.


