News November 29, 2025
నిర్మల్: కనుమరుగైన BRS.. స్థానిక ఎన్నికల్లో గెలుపు కష్టమేనా?

జిల్లాలో BRS పరిస్థితి దయనీయంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం, ఆ పార్టీ నుంచి పోటీ చేసిన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో జిల్లాలో పార్టీ కంటికి కనిపించకుండా పోయింది. ఖానాపూర్ నియోజకవర్గంలో ఇన్‌ఛార్జ్ జాన్సన్ ఉన్నా, ముథోల్ నియోజకవర్గంలో పార్టీ ఊసే లేదు. నాయకత్వ లోపం, చురుకుదనం లేకపోవడం వల్ల స్థానిక ఎన్నికల్లో BRS గెలవడం కష్టమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Similar News
News December 1, 2025
NGKL: పడమటి అంజనేయ స్వామి దేవాలయంలో సీఎం పూజలు

జిల్లా పర్యటనలో భాగంగా మక్తల్ పట్టణంలోని పడమటి అంజనేయ స్వామి దేవాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు సీఎం పేరిట ప్రత్యేకంగా అర్చన చేసి ఆయనను వేదమంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రులు జూపల్లి, దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
News December 1, 2025
NGKL: సోషల్ మీడియా పోస్టులపై పోలీసుల నిఘా

గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రకటన, ఎదుటివారిని కించపరిచే విధంగా పోస్టులు పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ హెచ్చరించారు. రెండు పార్టీల మధ్య విభేదాలు సృష్టించే విధంగా పోస్టులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
News December 1, 2025
NGKL: పార్టీ జెండాలు పక్కన పెట్టి కలిసి ఎన్నికల పోరులో నాయకులు

NGKL జిల్లాలో జరుగుతున్న GP ఎన్నికలలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న వివిధ పార్టీల నాయకులు ప్రస్తుతం పార్టీ జెండాలు పక్కన పెట్టి కలిసి పని చేస్తున్నారు. కొన్ని గ్రామాలలో బిజెపి, BRS పార్టీల నాయకులు కలిసి ఎన్నికలలో పోటీ చేస్తుండగా, మరికొన్ని చోట్ల కాంగ్రెస్ బీజేపీ నాయకులు కలిసి పోటీ చేస్తున్నారు. పదవుల కోసం ఎంతకైనా దిగజారుతారనే విమర్శలు ఉన్నాయి.


