News October 3, 2024
నిర్మల్: కల్లులో కలిపే కెమికల్స్ పట్టివేత
నిర్మల్ జిల్లా కేంద్రంలోని భారీగా కల్లులో కలిపే రసాయనాలను సీజ్ చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. స్థానిక శాంతినగర్ కాలనీలోఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. సుమారు రూ.43 లక్షల విలువైన 26 సంచుల క్లోరల్ హైడ్రేడ్, మూడు కిలోల ఆల్ఫోజోలం సీజ్ చేశామన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 21, 2024
నిర్మల్: ‘రైతులకు అవగాహన కల్పించాలి’
ఆధునిక పద్ధతులలో సంప్రదాయ పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ ఆహార భద్రత పథకం-2024, కింద జిల్లాలో వ్యవసాయ శాఖ ద్వారా అమలవుతున్న కార్యాచరణపై వ్యవసాయ శాఖ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. మహిళా శక్తి క్యాంటీన్లలో సేంద్రియ ఉత్పత్తుల ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచాలని తెలిపారు.
News December 21, 2024
ఆసిఫాబాద్: 44 కేసులలో 59 మంది అరెస్ట్
అక్రమ వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా SPశ్రీనివాసరావు హెచ్చరించారు. SP మాట్లాడుతూ.. జిల్లాలో జూన్ నుంచి ఇప్పటివరకు అక్రమంగా గుట్కాలు అమ్ముతున్న వారిలో 44 కేసులలో 59మందిని అరెస్ట్ చేసి, రూ.38,38152/-విలువగల గుట్కా రికవరీ చేశామన్నారు. PDS బియ్యం, ఇసుక, గుట్కా, గంజాయి లాంటి వాటితో అక్రమ వ్యాపారాలు చేసేవారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
News December 21, 2024
మంచిర్యాల: బస్టాండ్ శుభ్రం చేయాలని మందుబాబులకు శిక్ష
ఇటీవల మద్యం తాగి వాహనాలు నడిపిన నలుగురికి ఈనెల 18న కోర్టులో హాజరు పర్చగా 2వ అదనపు మెజిస్ట్రేట్ మంచిర్యాల బస్టాండను 5 రోజుల (ఈనెల 20 నుంచి 24) వరకు శుభ్రం చేయాలని శిక్ష విధించారు. ఇది ఇలా ఉండగా మరో 22మందిని ఇవాళ కోర్టులో హాజరు పరచగా 14మందిని 5రోజులు ట్రాఫిక్ అసిస్టెంట్ విధులు నిర్వర్తించాలని, మిగతా వారికి రూ.17500/-జరిమానా విధించారని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ B.సత్యనారాయణ తెలిపారు.