News April 10, 2025

నిర్మల్: కొడుకు పట్టించుకోవడం లేదని SPకి ఫిర్యాదు

image

కంటికి రెప్పలా కాపాడుకొని పెంచిన పిల్లలు వృద్ధాప్యంలో తల్లిదండ్రులను అలాగే కాపాడుకోవాలి. కానీ పెంచి పోషించిన కొడుకు తమను ఇబ్బందులు పెడుతున్నాడని వృద్ధ దంపతులు SP కార్యాలయం మెట్లెక్కారు. దిలావర్పూర్‌కు చెందిన బెల్లాల్ నర్సయ్య ఆస్తిని పెద్ద కుమారుడు తన పేరు మీద ఆస్తిని రాయించుకొని మనోవేదనకు గురి చేస్తున్నాడని నిర్మల్ SP జానకి షర్మిలకు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.

Similar News

News November 26, 2025

ఉర్విల్ ఊచకోత.. 10 సిక్సులు, 12 ఫోర్లతో..

image

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గుజరాత్ కెప్టెన్ ఉర్విల్ పటేల్ విధ్వంసం సృష్టించారు. 31 బంతుల్లోనే శతకం బాదారు. మొత్తంగా 37 బంతుల్లో 10 సిక్సులు, 12 ఫోర్లతో 119* రన్స్ చేశారు. తొలుత సర్వీసెస్ జట్టు 20 ఓవర్లలో 182/9 స్కోర్ చేయగా, ఉర్విల్ ఊచకోతతో గుజరాత్ 12.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కాగా T20లలో ఫాస్టెస్ట్ సెంచరీ ఉర్విల్ పేరుమీదనే ఉంది. 2024లో త్రిపురపై 28 బాల్స్‌లోనే శతకం చేశారు.

News November 26, 2025

సంగారెడ్డి: స్థానిక దంగల్.. రేపటి నుంచి నామినేషన్స్

image

సంగారెడ్డి జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. రేపటి నుంచి మెదటి విడత నామినేషన్లు స్వీకరిస్తారు. జిల్లాలోని 613 సర్పంచ్, 5,370 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 7,44,157 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 3,68,270, మహిళలలు 3,75,843, ఇతరులు 8 మంది ఉన్నారు. పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కోడ్ డిసెంబర్ 17 వరకు అమలులో ఉంటుంది.

News November 26, 2025

చెట్టు కోసం 363 మంది ప్రాణాలు కోల్పోయారు!

image

రాజస్థాన్ రాష్ట్ర వృక్షమైన హేజ్రీ చెట్టు ఉనికి వెనుక వందల మంది ప్రాణత్యాగం ఉందనే విషయం తెలుసా? 1730లో జోధ్‌పూర్ రాజు అభయ్ సింగ్ ప్యాలెస్ నిర్మాణానికి కలప సేకరించాలని సైనికులను పంపారు. ఇది తెలుసుకున్న బిష్ణోయ్ కమ్యూనిటీ సైనికులను అడ్డుకుంది. చెట్టును కౌగిలించుకుని నరకొద్దని కోరింది. సైనికులు వినకుండా 363 మందినీ నరికేశారు. ఇది తెలుసుకున్న రాజు చలించి చెట్లను నరకొద్దని ఆదేశించడంతో ఆ చెట్టు బతికింది.