News March 21, 2025
నిర్మల్: ఖాళీ పోస్టులు.. APPLY NOW

జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో వివిధ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుందని వైద్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు వైద్య కళాశాలలో టీచింగ్ స్టాప్ ఫ్యాకల్టీలను భర్తీ చేస్తామన్నారు. కలెక్టర్ అనుమతితో వైద్య కళాశాలలో వివిధ విభాగంలోని టీచింగ్ స్టాఫ్ ఫ్యాకల్టీలను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తామని పేర్కొన్నారు.
Similar News
News July 6, 2025
MNJ కేన్సర్ ఆస్పత్రికి 45 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు

MNJ కేన్సర్ ఆస్పత్రిలో ఇక మెరుగైన వైద్య సేవలందనున్నాయి. ఆస్పత్రికి 45 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను కేటాయిస్తూ మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. రోజురోజుకూ కేన్సర్ బాధితులు పెరిగిపోతుండటంతో లక్డీకపూల్(రెడ్ హిల్స్)లో ఉన్న MNJలో పేషెంట్లు చికిత్సకు ఇబ్బందులు ఏర్పడకుండా బోర్డు వీరిని నియమించింది.
News July 6, 2025
మహిళల రక్షణ కోసం ‘SWAT’ బృందం

HYD నగర పోలీసులు మహిళల భద్రత, నిరసన ప్రదర్శనల నిర్వహణ కోసం 35 మంది మహిళా పోలీసులతో “స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీమ్(SWAT)”ను ప్రారంభించారు. కరాటే, నిరాయుధ పోరాటంలో ప్రత్యేక శిక్షణ పొందిన ఈ బృందం ధర్నాలు, ర్యాలీలు, ముఖ్యమైన ఈవెంట్లు, పండుగల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషిచేస్తుంది. సరికొత్త యూనిఫాంలో సచివాలయం వద్ద విధుల్లో చేరిన ఈ బృందం.. మహిళల ఆందోళనలు నియంత్రించడంలో కీలకపాత్ర పోషించనుంది.
News July 6, 2025
విజయవాడ: భక్తులతో కిటకిటలాడిన కనకదుర్గమ్మ ఆలయం

ఆషాడ మాసపు చివరి ఆదివారం, తొలి ఏకాదశి కావడంతో కనకదుర్గమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వందలాది సారె బృందాలు అమ్మవారిని దర్శించుకున్నాయి. మహా మండపం ఆరవ అంతస్తులో శాకాంబరీ ఉత్సవాలకు భక్తులు సమర్పించిన కాయగూరలు, పండ్లను ఈవో శీనా నాయక్ పరిశీలించారు. సారె బృందాల కోసం లిఫ్ట్, దర్శన మార్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.