News April 13, 2025
నిర్మల్: గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు ఫ్రీ డ్రెస్

రాబోయే 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందజేయాల్సిన ఏకరూప దుస్తుల వస్త్రం జిల్లాకు చేరిందని డీఈవో రామారావు తెలిపారు. జిల్లాలోని 48,874 మంది విద్యార్థులకు సంబంధించిన ఏకరూప దుస్తుల వస్త్రం రెండు జతలకు సంబంధించి రావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఒక జతకు సంబంధించిన ఏకరూప దుస్తుల వస్త్రం వచ్చిందని చెప్పారు. జిల్లాలోని 19 మండలాలకు రెండు రోజుల్లో సరఫరా చేస్తామన్నారు.
Similar News
News December 21, 2025
TDP జిల్లా అధ్యక్షులు వీరే! 2/2

AP: * గుంటూరు – పిల్లి మాణిక్యరావు * ఎన్టీఆర్ – గద్దె అనురాధ * కృష్ణా – వీరంకి గురుమూర్తి * వెస్ట్ గోదావరి – రామరాజు * ఈస్ట్ గోదావరి – వెంకటరమణ చౌదరి * కోనసీమ – గుత్తుల సాయి * విశాఖ – చోడే వెంకట పట్టాభిరామ్ * అనకాపల్లి – బత్తుల తాతయ్య బాబు * కర్నూలు – గుడిశె కృష్ణమ్మ* నెల్లూరు – బీదా రవిచంద్ర * కడప – భూపేశ్ సుబ్బరామిరెడ్డి.
News December 21, 2025
TDP అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా సుగవాసి

అందరూ ఊహించినట్లే టీడీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా సుగవాసి ప్రసాద్ బాబు నియమితులయ్యారు. రాయచోటి నియోజకవర్గానికి చెందిన సుగవాసి కుటుంబం నాలుగు దశాబ్దాలుగా టీడీపీతో నడుస్తోంది. వారి సేవలను గుర్తించి ప్రసాద్ బాబుకు అధ్యక్ష పదవి కట్టబెట్టింది. అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శిగా పఠాన్ ఖాదర్ ఖాన్‌కు అవకాశం దక్కింది.
News December 21, 2025
శ్రీరాంపూర్: సింగరేణి రైటర్డ్ కార్మికులకు శుభవార్త

సింగరేణి రిటైర్డ్ కార్మికుల పట్ల కీలక నిర్ణయం తీసుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో పదవీ విరమణ పొందిన వారికి క్వార్టర్ ఖాళీ చేయాలనే నిబంధనతో సంబంధం లేకుండా 34 శాతం లాభాల వాటా, దీపావళి బోనస్ చెల్లించేందుకు అంగీకరించింది. AITUC నాయకత్వంలో జరిగిన చర్చలు సఫలం కావడంతో ఈ ఊరట లభించింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే నేరుగా కార్మికుల బ్యాంక్ ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేయనున్నారు.


