News October 13, 2025
నిర్మల్: గుర్తుతెలియని మృతదేహం..

నిర్మల్ జిల్లా జనరల్ ఆసుపత్రి మార్చురీలో ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ నెల 8న ఉదయం 11 గంటలకు ఈ వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుడిచేతిపై ‘మామ్ డాడ్’ అని పచ్చబొట్టు ఉందని తెలిపారు. మృతుని వివరాలు తెలిసినవారు వెంటనే తమను సంప్రదించాలని కోరారు.
Similar News
News October 13, 2025
కొత్త మద్యం పాలసీపై హైకోర్టులో పిటిషన్

TG: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీపై అనిల్‌కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలు పెట్టారని, లాటరీలో షాపు దక్కకపోతే ఆ డబ్బు ఎక్సైజ్ శాఖకే వెళ్తుందన్నారు. షాప్ రానివారికి రూ.3 లక్షలు తిరిగిచ్చేలా ఆ శాఖను ఆదేశించాలని, ఆ GOను కొట్టేయాలని కోర్టును కోరారు. దీనిపై విచారించిన కోర్టు ఎక్సైజ్ శాఖకు నోటీసులు జారీ చేసింది. విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.
News October 13, 2025
తిరుపతి: నాన్నతో కలిసి పాఠాలు..❤

కొత్త టీచర్లు విధుల్లో చేరే వేళ తిరుపతి జిల్లాలో సోమవారం ఆసక్తికర ఘటన వెలుగు చూసింది. చంద్రగిరి జడ్పీ స్కూల్లో రవీంద్రుడు తెలుగు టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆయన కుమారుడు హరిప్రసాద్ DSC రాసి ఫిజిక్స్ టీచర్‌గా సెలెక్ట్ అయ్యారు. తండ్రి పనిచేస్తున్న ఆ స్కూల్లోనే జాబ్ వచ్చింది. ఈక్రమంలో వారిద్దరూ తీసుకున్న ఫొటో వైరలవుతోంది. తండ్రితో కలిసే అతను పాఠాలు చెప్పనున్నారు.
News October 13, 2025
మేడ్చల్: ధాన్యం కొనుగోలు కేంద్రాలపై పౌరసరఫరాల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులకు సౌకర్యవంతమైన విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణం పరిశీలించాలని కమిషనర్ సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ సుగుణ భాయ్ పాల్గొన్నారు.