News July 1, 2024

నిర్మల్: ఘనా దేశంలో జిల్లా వాసి మృతి

image

నిర్మల్ జిల్లా దుస్తురాబాద్ మండల కేంద్రానికి చెందిన బరిగల వెంకటేశ్(34) బతుకు తెరువు కోసం ఘనా దేశానికి వెళ్లాడు. అక్కడ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. ప్రభుత్వం స్పందించి వెంకటేశ్ మృతదేహాన్నివీలైనంత తొందరగా స్వగ్రామానికి తెచ్చే విధంగా చర్యలు చేపట్టాలని మృతుని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Similar News

News July 3, 2024

బాసర : నేడు IIITలో ప్రవేశాల ఎంపిక జాబితా విడుదల

image

బాసర IIITలో 2024-25 విద్యా సంవత్సరంలో 1500 సీట్ల భర్తీ కోసం దరఖాస్తుల ప్రక్రియ పూర్తయ్యింది. జూన్ 1 నుంచి 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా విద్యార్థుల జాబితాను రూపొందించారు. మెరిట్ విద్యార్థుల జాబితాను క్యాంపస్‌లో విడుదల చేయనున్నారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయన్న వివరాలు బుధవారం వెల్లడిస్తామని ఇన్‌ఛార్జి వీసీ తెలిపారు. జాబితా విడుదలైన అనంతరం కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు.

News July 3, 2024

మాజీ సీఎంను కలిసిన నిర్మల్ నేతలు

image

మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును మంగళవారం ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో నిర్మల్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ కొరిపల్లి విజయలక్ష్మి, బీఆర్ఎస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ సమన్వయకర్త రామ్ కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ స్థితిగతులపై చర్చించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కేసీఆర్ సూచించారు.

News July 2, 2024

నిర్మల్: ప్రమాదవశాత్తు బండరాయిపై పడి వ్యక్తి మృతి

image

సారంగాపూర్ మండలం అడేల్లిపోచమ్మ ఆలయ సమీపంలో గల రిజర్వ్ ఫారెస్ట్‌లో ప్రమాదవశాత్తు బండరాయిపై పడి వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. కౌట్ల(బి) గ్రామానికి చెందిన భీమన్న అనే వ్యక్తి మంగళవారం పోచమ్మ ఆలయం వద్ద గ్రామస్థులు పండుగ చేయగా అక్కడికి వెళ్ళాడు. మోదుగ ఆకులు తెంపడానికి రిజర్వ్ ఫారెస్ట్‌కు వెళ్లగా ప్రమాదవశాత్తు బండరాయిపై జారిపడ్డాడు.