News July 10, 2025

నిర్మల్ జిల్లాకు 7 సబ్ స్టేషన్లు మంజూరు

image

వినియోగదారులకు మెరుగైన విద్యుత్తును సరఫరా చేసేందుకు ప్రభుత్వం నిర్మల్ జిల్లాకు 7 సబ్ స్టేషన్లు మంజూరు చేసినట్లు ఎస్ఈ సాలియా నాయక్ తెలిపారు. జిల్లాలోని డోడర్నా, రామ్‌సింగ్ తండా, సోఫీనగర్, మహాలింగి, కోలూరు, పల్సి, దత్తోజిపేట్ గ్రామాల్లో సబ్ స్టేషన్ల ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. ఆయా ఫీడర్ల పరిధిలో లో వోల్టేజీ సమస్య తీరుతుందని చెప్పారు.

Similar News

News July 10, 2025

కుళ్లాయి స్వామి చివరి దర్శనం

image

గూగూడు కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం రాత్రి చివరి దర్శనంతో ఘనంగా ముగిశాయి. రాత్రి 7 గంటల సమయంలో తిరుమల కొండన్న వంశీయులు కుళ్లాయి స్వామి ప్రధాన పీరుని అలంకరించి చావిడిలో భక్తులకు దర్శనం కల్పించారు. ప్రధాన అర్చకుడు హుసేనప్ప ప్రార్థనలు చేశారు. ‘కుళ్లాయి స్వామి గోవిందా..’ నామ్మస్మరణతో గూగూడు మార్మోగింది. అనంతరం స్వామి పీర్లను పెట్టెలో పెట్టి మకానంలో భద్రపరిచారు.

News July 10, 2025

జగన్ పర్యటనపై మూడు కేసుల నమోదు

image

జగన్ బంగారపాళ్యం పర్యటనలో మూడు పోలీసు కేసులు నమోదయ్యాయి. నిబంధనలు ఉల్లంఘించి రోడ్డు షో చేశారంటూ పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్, నాయకులు కుమార్ రాజా, పాలేరు రామచంద్రారెడ్డిపై కేసు పెట్టారు. రోడ్డుపై మామిడి కాయలు పోసిన డ్రైవర్లపై మరో కేసు నమోదు కాగా ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌‌పై దాడి చేసినట్లు మరోకేసు పెట్టారు.

News July 10, 2025

ఏలూరు: దాడికి పాల్పడిన వారికి 3 నెలల జైలు శిక్ష

image

వంకాయగూడెంలో స్థలం వివాదంలో గొడవకు పాల్పడిన దాసరి వీరస్వామి, రాంబాబు, మిరియాల రంగారావుకు ఏలూరు సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి రజిని రూ.1000 జరిమానా/మూడు నెలల జైలు శిక్షను బుధవారం విధించారు. 2019 జులైలో ముక్కు గౌతమ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏలూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంటి స్థలంలో గొడవకు దిగి దాడికి పాల్పడినట్లు నేరం రుజువైనందున శిక్ష విధించినట్లు జడ్జి రజిని పేర్కొన్నారు.