News March 18, 2026
నిర్మల్ జిల్లాలోని త్వరలో ‘కిసాన్ మేళా’: కలెక్టర్

నిర్మల్ జిల్లాలో త్వరలోనే ‘కిసాన్ మేళా’ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ఈ మేళాలో సేంద్రీయ వ్యవసాయం, కిచెన్ గార్డెనింగ్, రూఫ్‌టాప్ గార్డెనింగ్‌పై ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రగతిశీల రైతుల అనుభవాలను ఇతరులతో పంచుకునేలా కార్యక్రమాలు రూపొందించాలని, ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలని ఆమె స్పష్టం చేశారు.
Similar News
News March 27, 2026
రాష్ట్రంలో మరో 7 రోజులు వర్షాలు

TG: రాష్ట్రంలో మరో 7 రోజులు వర్షాలు పడే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది. APR 3వ తేదీ వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే ఆస్కారముందని చెప్పింది. ఇక రేపు 8.30am వరకు ADB, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, NZB, జగిత్యాల, యాదాద్రి, RR, HYD, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.
News March 27, 2026
వరంగల్: జనగణన తొలి దశకు సర్వం సిద్ధం

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మే 11 నుంచి జూన్ 9 వరకు జరగనున్న మొదటి దశ జనగణన, ఇళ్ల గుర్తింపు సర్వేకు అధికారులు సిబ్బందిని కేటాయించారు. ప్రతి 800 మంది జనాభాకు ఒక ఎన్యూమరేటర్ చొప్పున నియామకాలు చేపట్టారు. వరంగల్ జిల్లాలో 1135, హనుమకొండలో 1030, మహబూబాబాద్‌లో గరిష్టంగా 1702 మందితో పాటు మిగిలిన జిల్లాల్లోనూ వివిధ శాఖల నుండి సూపర్ వైజర్లను నియమించి కసరత్తు పూర్తి చేశారు.
News March 27, 2026
హైదరాబాద్: రూ. 217 కోట్ల భారీ జీఎస్‌టీ స్కామ్

తెలుగు రాష్ట్రాల్లో రూ. 217 కోట్ల జీఎస్‌టీ కుంభకోణాన్ని డీజీజీఐ (DGGI) అధికారులు ఛేదించారు. 72 షెల్ కంపెనీల ద్వారా ఎలాంటి వస్తు సరఫరా లేకుండానే రూ. 1,472 కోట్ల నకిలీ లావాదేవీలు సృష్టించినట్లు గుర్తించారు. తప్పుడు పత్రాలతో ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టి, అక్రమంగా ఐటీసీ (ITC) క్లెయిమ్ చేశారు. హైదరాబాద్, ఏపీల్లో జరిపిన దాడుల్లో కీలక సాక్ష్యాధారాలు, డిజిటల్ డేటాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


