News January 6, 2026

నిర్మల్ జిల్లాలో అస్థిపంజరం కలకలం

image

నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పల్సి గ్రామ శివారులో సోమవారం ఓ అస్థిపంజరం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. గ్రామ శివారులోని ఓ చేనులో నోటి దౌడ ఎముకలతో పాటు బాడీ ఎముకలు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అస్తిపంజరాల ఎముకలను సేకరించి పోరాన్సిక్ ల్యాబ్‌కు పంపించినట్లు తెలిపారు.

Similar News

News January 20, 2026

డ్రైవర్లు మీ కుటుంబ భవిష్యత్తు మీ చేతుల్లోనే: భూపాలపల్లి ఎస్పీ

image

రోడ్డు ప్రమాదం ఒక్క డ్రైవర్‌కే కాకుండా ఆయనపై ఆధారపడి ఉన్న మొత్తం కుటుంబాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఎస్పీ సంకీర్త్ అన్నారు.ప్రమాదాల్లో గాయాలు లేదా మరణాలు సంభవిస్తే,కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు,ఉపాధి కోల్పోవడం,కుటుంబ పోషణలో సమస్యలు,పిల్లల చదువు దెబ్బతినడం,మానసిక వేదన వంటి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని డ్రైవర్లకు వివరించారు.ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాన్నారు.

News January 20, 2026

స్టేషన్ ఘనపూర్ మోడల్ స్కూల్‌లో పార్ట్‌టైం యోగా టీచర్ నోటిఫికేషన్

image

స్టేషన్ ఘనపూర్‌లోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో విద్యార్థుల శారీరక-మానసిక ఆరోగ్య అభివృద్ధి కోసం యోగా బోధించేందుకు పార్ట్‌టైం యోగా టీచర్/ పార్ట్‌టైం వ్యాయామ ఉపాధ్యాయులు అవసరమని పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. యోగా లేదా ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో అర్హతలు కలిగిన అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో కలిసి 22-01-2026 లోగా పాఠశాల కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు.

News January 20, 2026

జనగామ: ప్రధాన్ మంత్రి ధన్ ధాన్య యోజన అమలుపై సమీక్ష

image

జనగామ జిల్లాలో ప్రధాన్ మంత్రి ధన్ ధాన్య యోజన అమలుపై కేంద్ర ప్రభుత్వం నియమించిన టెక్నికల్ ఆఫీసర్ రిషికాంత్, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆధ్వర్యంలో ఐడీఓసీ కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. రైతులకు సులభతరంగా రుణ సహాయం అందించడం, ప్రత్యామ్నాయ పంటల సాగు, వ్యవసాయ రంగంలో సాంకేతికత అభివృద్ధి గురించి చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.