News February 10, 2025
నిర్మల్ జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు ఇవే!

నిర్మల్ జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఈ నెల 15 లోపు ఎన్నికల సిబ్బందికి శిక్షణతో పాటు పోలింగ్ కేంద్రాల తుది జాబితాను విడుదల చేయనున్నారు. జిల్లాలో మొత్తం 157 ఎంపీటీసీ, 18 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. కాగా ఈ నెల 11న పోలీంగ్ కేంద్రాల ముసాయిదా విడుదల కానుంది.
Similar News
News February 24, 2026
శ్రీకాకుళం: జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీల నిర్వహణ

శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో మంగళవారం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో సైక్లింగ్ పోటీలు నిర్వహించారు. అండర్-18 పురుషులు, మహిళల విభాగంలో ఈ పోటీలు జరిగాయి. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి మహేశ్ బాబు పోటీలను పర్యవేక్షించారు. విజేతలు ఈనెల 28న ఎన్టీఆర్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.
News February 24, 2026
గద్వాల: ఇంటర్ పరీక్షలకు పటిష్ఠ బందోబస్తు

గద్వాల జిల్లాలో రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షల కోసం 14 కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 163 BNSS (144 సెక్షన్) అమలులో ఉంటుందని, 8,471 మంది విద్యార్థులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. మార్చి 16 వరకు జరిగే ఈ పరీక్షల సమయాల్లో జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని ఆదేశించారు.
News February 24, 2026
సమన్వయంతో బోర్డు పరీక్షలు నిర్వహించండి: సీఎస్

పదో తరగతి, ఇంటర్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు దిశానిర్దేశం చేస్తూ.. జిల్లాలో 13,125 మంది ఇంటర్, 9,758 మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు.


