News February 18, 2026

నిర్మల్ జిల్లాలో ఎల్లుండి సెలవు

image

ఫిబ్రవరి 20న నిర్మల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు పబ్లిక్ హాలిడే ఇస్తున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రకటించారు. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల సందర్భంగా స్థానిక సెలవు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. దానికి బదులు మార్చి 14 (రెండో శనివారం)ను పని దినంగా ఉంటుందన్నారు. సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Similar News

News February 18, 2026

వేసవి కార్యాచరణ సిద్ధం చేయాలి: కామారెడ్డి కలెక్టర్

image

కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలులో అధికారులు నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ‘సమ్మర్ యాక్షన్ ప్లాన్’ సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు.

News February 18, 2026

కండోమ్ వాడకంతో సంతానలేమి? ప్రచారంలో నిజమెంత?

image

కండోమ్‌లను ఎక్కువగా వాడటం వల్ల పురుషుల్లో సంతానలేమి సమస్యలు వస్తాయనేది అపోహేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇవి కేవలం స్త్రీ గర్భాశయంలోకి స్పెర్మ్ వెళ్లకుండా అడ్డుకుంటాయే తప్ప పురుషుల హార్మోన్లపై లేదా స్పెర్మ్ క్వాలిటీపై ఎలాంటి ప్రభావం చూపవు. పైగా సుఖవ్యాధుల (STIs) నుంచి రక్షణ కల్పించడం ద్వారా ఇవి పరోక్షంగా ఫర్టిలిటీ హెల్త్‌ను కాపాడతాయి. సంతానోత్పత్తికి వీటివల్ల ముప్పు ఉండదని స్పష్టం చేశారు.

News February 18, 2026

సూర్యాపేట: నెల రోజుల్లో మాతా శిశు కేంద్రం సిద్ధం కావాలి: కలెక్టర్

image

సూర్యాపేట మాతా శిశు కేంద్రం భవన పనులను నెల రోజుల్లో పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. బుధవారం ఆసుపత్రిని తనిఖీ చేసిన ఆయన, వైద్య పరికరాల కోసం ప్రతిపాదనలు పంపాలన్నారు. కోదాడ ఘటనపై స్పందిస్తూ.. పిల్లలను వద్దనుకునే వారు వారిని రోడ్డుపై వదలకుండా ఆసుపత్రిలోని ‘ఉయ్యాల’లో ఉంచాలని తల్లులకు సూచించారు.