News December 11, 2025
నిర్మల్ జిల్లాలో తొలి విజయం మహిళదే

నిర్మల్ జిల్లా మామడ మండలం ఆదర్శ నగర్ సర్పంచ్‌గా బర్కుంట లక్ష్మి ప్రత్యర్థి నల్ల రుక్మపై 9 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ మొదలవగా ఆదర్శ నగర్ ఫలితాలు విడుదలయ్యాయి.
Similar News
News March 27, 2026
క్యాన్సర్‌తో తిరుపతి పోలీస్ డాగ్ మృతి

తిరుపతి జిల్లాలో పోలీస్ డాగ్ చనిపోయింది. 2016లో హైదరాబాద్ మోయినాబాద్‌లోని IITAలో ‘హంటర్’ డాగ్ ట్రైనింగ్ తీసుకుంది. తర్వాత తిరుపతికి తీసుకు వచ్చారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంలో విశేషంగా కృషి చేసింది. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఈక్రమంలో గురువారం మధ్యాహ్నం చనిపోయింది. ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ డి.శ్రీనివాసరావు, సిబ్బంది హంటర్‌కు నివాళులు అర్పించారు.
News March 27, 2026
పాలమూరు: ఒకేసారి 3 నెలల రేషన్

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రేషన్ పంపిణీపై పౌర సరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నెలతో పాటు మే, జూన్ నెలల రేషన్ ఒకేసారి ఇస్తున్నట్లు సివిల్ సప్లై అధికారులు తెలిపారు. ➤మహబూబ్‌నగర్ 2,39,503 ➤నాగర్‌కర్నూల్ 2,69,213 ➤జోగులాంబ గద్వాల 1,60,106 ➤వనపర్తి 1,56,715 ➤నారాయణపేట 1,35,000 కార్డులు ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రేషన్ కార్డుల సంఖ్య సుమారు 9.60 లక్షలుగా ఉంది.
News March 27, 2026
ఏప్రిల్ 2న పార్లమెంటులో అమరావతి బిల్లుకు ఛాన్స్: చంద్రబాబు

AP: రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై రేపు అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. దాన్ని ఆమోదించి కేంద్రానికి పంపిస్తే ఏప్రిల్ 1న కేంద్ర క్యాబినెట్ ముందుకు వెళ్తుందన్నారు. కుదిరితే ఏప్రిల్ 2నే పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్పారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా అమరావతిపై జగన్ కుట్రలను ప్రజలకు తెలియజేయాలని మంత్రులకు సూచించారు.


