News February 27, 2025
నిర్మల్ జిల్లాలో నమోదైన పోలింగ్ వివరాలు

ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నిర్మల్ జిల్లాలో ఉదయం 10 గంటల వరకు నమోదైన పోలింగ్ వివరాలను అధికారులు వెల్లడించారు. మొత్తం 1,206 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా 7.04 శాతంగా పోలింగ్ నమోదయింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 201 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా 10.22 శాతం పోలింగ్ నమోదయినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News February 4, 2026
ఎమ్మెల్యే సంజయ్‌పై అనర్హత పిటిషన్ కొట్టివేత

TG: ఫిరాయింపుల కేసులో మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ లభించింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై అనర్హత పిటిషన్‌ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టివేశారు. ఆయన పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు. ఇప్పటికే పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్‌ల అనర్హత పిటిషన్లనూ కొట్టేసిన విషయం తెలిసిందే.
News February 4, 2026
కల్వకుర్తి: పురపోరులో ఎంబీఏ విద్యార్థిని ‘విందు’

కల్వకుర్తి మున్సిపాలిటీ 15వ వార్డు బీజేపీ అభ్యర్థిగా ఎంబీఏ విద్యార్థిని పెద్దారి విందు బరిలో నిలిచారు. మాజీ కౌన్సిలర్ పెద్దారి విజయ్ కుమార్తె అయిన ఆమె, కాంగ్రెస్, బీఆర్ఎస్ బలమైన అభ్యర్థులకు ధీటుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. యువత ప్రాతినిధ్యం పెరగాలని, వార్డు అభివృద్ధికి తనను గెలిపించాలని ఆమె ఓటర్లను కోరుతున్నారు.
News February 4, 2026
పాలమూరు: మాజీ మంత్రిపై కేసు నమోదు

జడ్చర్ల మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా మంగళవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే, పోలీసుల నుంచి ఎటువంటి అనుమతి తీసుకోకుండా ర్యాలీ చేపట్టి, ప్రజలకు ఇబ్బంది కలిగించినందుకు సీఐ కమలాకర్ చర్యలు చేపట్టారు. మాజీ మంత్రితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.


