News March 11, 2025

నిర్మల్‌ జిల్లాలో పలువురు CIల బదిలీలు

image

నిర్మల్ జిల్లాలో పలువురు CIలను రాష్ట్ర పోలీసు అధికారులు బదిలీ చేస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులను జారీ చేశారు. డీసీఆర్‌బీలో CIగా విధులు నిర్వహిస్తున్న ప్రేమ్ కుమార్‌ను డీఎస్‌బీకి బదిలీ చేశారు. సీసీఎస్ విభాగంలో CIగా విధులు నిర్వహిస్తున్న కృష్ణను నిర్మల్ రూరల్ CIగా, హైదరాబాద్‌లో వెయిటింగ్ లిస్టులో ఉన్న సమ్మయ్యను డీసీఆర్‌బీ నిర్మల్‌కు బదిలీ చేశారు.

Similar News

News March 11, 2025

‘ఛావా‘ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్?

image

విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘ఛావా‘ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 11న ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం. కాగా బాలీవుడ్‌లో దుమ్మురేపిన ఈ మూవీ తెలుగులోనూ పాజిటివ్ టాక్‌ సొంతం చేసుకుంది. విడుదలైన మూడు రోజులకే రూ.10 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

News March 11, 2025

మణిపుర్‌లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు జవాన్ల వీరమరణం

image

మణిపుర్‌లో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్కు లోయలో పడటంతో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. మరో 13మంది గాయాలపాలయ్యారు. సేనాపతి జిల్లాలోని చాంగౌబంగ్ గ్రామం సమీపంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లా మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేశారు.

News March 11, 2025

బీరువాలో కాగితాలు.. వాటి విలువ రూ.12 లక్షలు!

image

ఇంట్లోని పాత కాగితాలు అతనికి దాదాపు రూ.12 లక్షలు తెచ్చిపెట్టాయి. రతన్ అనే వ్యక్తికి తన తండ్రి 1992లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో కొన్న షేర్స్ అగ్రిమెంట్ పేపర్స్ బీరువాలో లభించాయి. ఒక్క షేర్‌ రూ.10 చొప్పున 30 షేర్లు కొనుగోలు చేశారు. దీని గురించి రతన్ ట్వీట్ చేయడంతో ట్రేడ్ నిపుణులు కామెంట్స్ చేస్తున్నారు. అన్ని బోనస్‌లు కలిపి ఇప్పుడవి 960 షేర్స్ అయ్యాయని, వీటి విలువ రూ.11.88 లక్షలని చెబుతున్నారు.

error: Content is protected !!