News April 10, 2024
నిర్మల్ జిల్లాలో పోలీస్ యాక్ట్

నిర్మల్ జిల్లాలో శాంతి భద్రత దృష్ట్యా, ప్రశాంతత పెంపొందించేందుకు ఏప్రిల్ 1 నుంచి 30 వరకు పోలీస్ ఆక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. పోలీసు ఉన్నత అధికారుల నుంచి ఎలాంటి అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ధర్నాలు, చేపట్టవద్దని డీజేలు, వాడరాదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
Similar News
News February 26, 2026
ఆదిలాబాద్‌లో SSC విద్యార్థులకు గ్రాండ్ ప్రాక్టీస్ టెస్టులు

ఆదిలాబాద్ జిల్లాలో పదో తరగతి విద్యార్థుల కోసం గ్రాండ్ టెస్టుల షెడ్యూల్‌ను జిల్లా విద్యాశాఖ విడుదల చేసింది. మార్చి 2 నుంచి 10 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులకు ప్రత్యేక తేదీలను కేటాయించారు. ఈ పరీక్షల ద్వారా విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు మరింత మెరుగ్గా తయారవ్వాలనే ఉద్దేశంతో అధికారులు ఈ చర్యలు చేపట్టారు.
News February 26, 2026
ADB: 369 మంది విద్యార్థులు గైర్హాజరు

ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గురువారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని డీఐఈఓ జాదవ్ గణేష్ తెలిపారు. ఎక్కడా ఎలాంటి మాల్ ప్రాక్టీస్ ఘటనలు చోటు చేసుకోలేదని వెల్లడించారు. మొత్తం 8,549 మంది విద్యార్థులకు గాను 8,180 మంది హాజరయ్యారని, 369 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
News February 26, 2026
ఉట్నూర్ ఐటీడీఏ PO ఖుష్బూ గుప్త బదిలీ

రాష్ట్రవ్యాప్త ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ఉట్నూర్ ఐటీడీఏ PO ఖుష్బూ గుప్తను ప్రభుత్వం బదిలీ చేసింది. మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రాజెక్ట్ అధికారిగా ఖుష్బూ గుప్త మహిళ స్వయం సంఘాల అభివృద్ధి ఉపాధి కల్పన తదితర అంశాలపై జాతీయస్థాయిలో అవార్డును సైతం పొందారు. అనంతరం వ్యక్తిగత సెలవులపై వెళ్లిన పిఓ స్థానంలో ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మట్ పిఓ వ్యవహరిస్తున్నారు..


