News February 5, 2025
నిర్మల్ జిల్లాలో బయటపడ్డ గణపతి, కాలభైరవ విగ్రహాలు
నిర్మల్ జిల్లా ముధోల్ జడ్పీ ఉన్నత పాఠశాల దగ్గరలోని పొలంలో గణపతి, కాలభైరవ విగ్రహాలు బయటపడ్డాయి. మట్టిలో కూరుకుపోయిన ఒక రాతి గుండు మీద రాష్ట్రకూట శైలిలో ఉన్న ద్విభుజ గణపతి విగ్రహం, దానికి ఒక పక్కన కాలభైరవుడు, మరో పక్క సర్పం విగ్రహాలు బయటపడ్డాయి. స్పష్టంగా చెక్కబడిన ఈ విగ్రహాలు రేఖామాత్రంగా కనిపిస్తున్నాయి. 9వ శతాబ్దానికి చెందిన భావిస్తున్న భావిస్తున్న ఈ విగ్రహంలో గణపతి సుఖాసన స్థితిలో ఉంది.
Similar News
News February 5, 2025
ఎన్టీఆర్ సినిమాలో కన్నడ బ్యూటీ!
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ నటిస్తారని సినీ వర్గాలు నిర్ధారించాయి. మలయాళ నటుడు టోవినో థామస్ కూడా కీలక పాత్రలో నటిస్తారని పేర్కొన్నాయి. ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కాని ఈ చిత్రం 2026 జనవరి 9న రిలీజ్ అవుతుందని తెలిపాయి. దీనిపై మూవీ యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
News February 5, 2025
SPMVV: స్టార్టప్‌లకు దరఖాస్తులు
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం బిజినెస్ ఇంక్యుబేటర్ల ద్వారా స్టార్టప్ గ్రాంట్‌లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం వెల్లడించింది. నూతన ఆలోచనలో ఉన్న యువ మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని వర్సిటీ అధికారులు తెలిపారు. రూ.10 లక్షల వరకు స్టార్టప్ గ్రాంట్ వస్తుందన్నారు. ఆసక్తి కలిగిన వారు వివరాలకు https://www.spmvv.ac.in/ వెబ్‌సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 10.
News February 5, 2025
విద్యార్థినిపై అత్యాచారం కేసులో నిందితుడు అరెస్ట్
విద్యార్థినిపై అత్యాచారం కేసులో జూనియర్ లెక్చరర్ వేదాల వినయ్ మంగళవారం పోలీసులకు లొంగిపోయాడు. కేసు వివరాలను కొవ్వూరులో DSP దేవకుమార్ తెలిపారు. భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న వినయ్ ప్రస్తుతం ఓ ప్రైవేట్ కాలేజీలో జూ.లెక్చరర్‌గా పని చేస్తున్నారు. తనకు పెళ్లి కాలేదని నమ్మించి ఇంటర్ సెకండియర్ అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఈ నెల 28న విజయవాడలో లాడ్జికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.