News February 5, 2025
నిర్మల్ జిల్లాలో బయటపడ్డ గణపతి, కాలభైరవ విగ్రహాలు

నిర్మల్ జిల్లా ముధోల్ జడ్పీ ఉన్నత పాఠశాల దగ్గరలోని పొలంలో గణపతి, కాలభైరవ విగ్రహాలు బయటపడ్డాయి. మట్టిలో కూరుకుపోయిన ఒక రాతి గుండు మీద రాష్ట్రకూట శైలిలో ఉన్న ద్విభుజ గణపతి విగ్రహం, దానికి ఒక పక్కన కాలభైరవుడు, మరో పక్క సర్పం విగ్రహాలు బయటపడ్డాయి. స్పష్టంగా చెక్కబడిన ఈ విగ్రహాలు రేఖామాత్రంగా కనిపిస్తున్నాయి. 9వ శతాబ్దానికి చెందిన భావిస్తున్న ఈ విగ్రహంలో గణపతి సుఖాసన స్థితిలో ఉంది.
Similar News
News March 9, 2026
ఆదిలాబాద్: పలువురు తహశీల్దార్‌లకు స్థానచలనం

ముగ్గురు తహశీల్దార్లు, నలుగురు నాయబ్ తహశీల్దార్లకు స్థానచలనం కలిగింది. మండలాల్లో పనిచేస్తున్న అధికారులను బదిలీ చేస్తూ కలెక్టర్ రాజర్షిషా ఉత్తర్వులు జారీ చేశారు. భీంపూర్ తహశీల్దార్ నలంద ప్రియను కలెక్టర్ కార్యాలయ హెచ్-విభాగం సూపరింటెండెంట్‌గా బదిలీ అయ్యారు. ఉట్నూర్ తహశీల్దార్ ప్రవీణ్ కుమార్ బేలకు స్థానచలనం కల్పించారు. కలెక్టర్ కార్యాలయం-హెచ్ సూపరింటెండెంట్ పంచపూలను డీ విభాగానికి వెళ్లారు.
News March 9, 2026
ఆదిలాబాద్: రేపే జాబ్ మేళ.. అన్ని ఏర్పాట్లు పూర్తి

ఆదిలాబాద్ పట్టణంలోని AR హెడ్ క్వాటర్స్‌లో మంగళవారం మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సుమారు 50 వరకు కంపెనీలు ఇందులో పాల్గొని దాదాపు 2,000 మందిని భర్తీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఆసక్తి గల నిరుద్యోగులు తమ ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.
News March 8, 2026
ADB: ట్రేడ్ టెస్ట్ పరీక్షలకు దరఖాస్తులు

ITI సంబంధిత ఏదైనా ట్రేడుల్లో అనుభవం ఉండి సర్టిఫికేట్ లేని ప్రైవేట్ అభ్యర్థుల నుంచి ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ పరీక్షలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ ITI ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ITI కోర్సులకు సంబంధించిన ట్రేడుల్లో కనీసం 3 సం.ల పని అనుభవం కలిగి, 21 వయస్సు వారు అర్హులని పేర్కొన్నారు. ఈ నెల 15 లోపు వరంగల్‌లోని రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ అఫీసులో దరఖాస్తు చేసుకోవాలన్నారు.


