News October 20, 2025
నిర్మల్: జిల్లాలో మద్యం దుకాణాలకు 942 దరఖాస్తులు

జిల్లాలో 47 నూతన మద్యం దుకాణాలకు సంబంధించి మొత్తం 942 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి రజాక్ తెలిపారు. మద్యం దుకాణాల దరఖాస్తు గడు ఈనెల 23వ తేదీ వరకు పొడగించినట్లు చెప్పారు. ఆసక్తి కలిగిన వారు మధ్య దుకాణాలకు జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవచ్చని అన్నారు. ఈనెల 27న దుకాణాల టెండర్లను డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేస్తున్నట్టు చెప్పారు.
Similar News
News October 20, 2025
దీపావళి పండుగ వేళ దారుణం.. భార్యను కడతేర్చిన భర్త

దీపావళి పండుగ వేళ అనంతపురం జిల్లాలో విషాద ఘటన జరిగింది. కడవరకూ తోడుంటానని వేదమంత్రాల సాక్షిగా తాళికట్టిన భర్త భార్యను నరికి చంపాడు. ఈ ఘటన డి.హిరేహాల్ మం. మురడిలో జరిగింది. టి.వీరాపురానికి చెందిన నాగరత్నమ్మకు 12ఏళ్ల క్రితం మురడికి చెందిన హనుమంతరాయుడితో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. వీరి మధ్య ఏం జరిగిందో గానీ సోమవారం తెల్లవారుజామున హనుమంతరాయుడు భార్యను చంపాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 20, 2025
కావలి: మాలేపాటి సుబ్బానాయుడు మృతి

ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు మృతి చెందారు. బ్రెయిన్ స్టోక్‌తో గత 10 రోజులుగా విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాలేపాటి ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. శనివారం రాత్రి మాలేపాటి అన్న కుమారుడు బాను గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. అంతక్రియలు ఇవాళ దగదర్తిలో నిర్వహించనున్నారు. మాలేపాటి మరణ వార్తతో ఆ కుటుంబం శోకసముద్రం మునిగిపోయింది.
News October 20, 2025
కారుచీకట్లు తొలగిపోయి, చిరుదివ్వెల వెలగాలి: KMR కలెక్టర్

దీపావళి పండుగను పురస్కరించుకొని KMR కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు దీపావళి పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ప్రజలందరి జీవితాల్లో కష్టాల కారుచీకట్లు తొలగిపోయి, చిరుదివ్వెల వెలుగుల వలే అనునిత్యం సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. పండుగను ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ, ఇంటిల్లిపాది ఆనందంగా జరుపుకోవాలన్నారు.