News February 19, 2026

నిర్మల్ జిల్లాలో మరాఠాల ముద్ర!

image

శివాజీ నేరుగా ఇటు రాకున్నా మరాఠా బలగాలు గోదావరి తీరం వెంట విస్తృతంగా సంచరించాయి. నాటి సైనిక కదలికల వల్లే నిర్మల్ పరిసరాలతో పాటు ముధోల్, బాసర, లోకేశ్వరం ప్రాంతాల్లో ‘ఆరె మరాఠా’ సమాజం పెద్దఎత్తున స్థిరపడింది. కట్టడాల ఆనవాళ్లు లేకున్నా శివాజీ స్ఫూర్తి, మరాఠా సంస్కృతి ఇక్కడి చరిత్రలో నిక్షిప్తమై ఉన్నాయి. వారు నేటికీ జయంతులు ఘనంగా జరుపుతూ ఆ వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్నారు.

Similar News

News February 19, 2026

పొందూరు: చెట్టుపై నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

పొందూరు మండలం లోలుగుకు చెందిన నీలప్పడు కొబ్బరి చెట్టు మీద నుంచి ప్రమాదవశాత్తు జారి పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొబ్బరి బొండాలు దించే ప్రయత్నంలో బుధవారం కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం కుటుంబీకులు ఓ ప్రైవేటు ఆసుప్రతిలో చేర్చగా అక్కడే చికిత్స పొందుతూ గురువారం మరణించాడు. డెడ్ బాడీని పోస్టుమార్టానికి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

News February 19, 2026

మాతా శిశు మరణాలు తగ్గించాలి: మహబూబాబాద్ కలెక్టర్

image

వైద్య ఆరోగ్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో శుక్రవారం కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో మాతా శిశు మరణం తగ్గించి, భ్రూణ హత్యలను నివారించాలని అధికారులకు సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రిలలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించకుండా, క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

News February 19, 2026

హస్తినలో జగ్గారెడ్డి ‘కమ్మ’ రాయబారం!

image

TGలో ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ స్థానాలకు మార్చి 16న ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీలో కాంగ్రెస్‌కి ఉన్న మెజారిటీ దృష్ట్యా, ఈ 2 స్థానాలూ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే VH నేరుగా అధిష్ఠానానికి లేఖ రాయగా, రాష్ట్ర స్థాయి కీలక నేతలూ ఢిల్లీలోనే ఉండి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. కమ్మ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని జగ్గారెడ్డి గట్టిగా కోరుతున్నట్లు సమాచారం.