News May 7, 2025

నిర్మల్‌ జిల్లాలో ముగిసిన సార్వత్రిక పరీక్షలు: డీఈవో

image

నిర్మల్ జిల్లాలో పదో తరగతి, ఇంటర్ సార్వత్రిక పరీక్షలు శుక్రవారం ముగిశాయని జిల్లా విద్యాధికారి రామారావు తెలిపారు. ఈ ప్రధాన పరీక్షలు ఈ నెల20 నుంచి 25వ తేదీ వరకు జరిగాయని తెలిపారు. శనివారం ఓకేషనల్ పరీక్ష మాత్రమే జరుగుతుందని ఆయన తెలిపారు. సార్వత్రిక పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.

Similar News

News April 2, 2026

భద్రాద్రి జిల్లాలో తునికాకు మోడెం పనులు ప్రారంభం

image

భద్రాద్రి జిల్లాలో తునికాకు సేకరణకు సన్నాహాలు మొదలయ్యాయి. ఆకు చిగురించడం కోసం చేపట్టే మోడెం (ప్రూనింగ్) పనులను అటవీశాఖ ప్రారంభించింది. జిల్లాలోని 31యూనిట్ల పరిధిలో 25,900స్టాండర్డ్ బ్యాగుల సేకరణను లక్ష్యంగా నిర్దేశించారు. వారం రోజుల పాటు ప్రూనింగ్ పనులు నిర్వహించి, ఈ నెల చివరలో ఆకు సేకరణ ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం డివిజన్లలో ఈ పనులు సాగుతున్నాయి.

News April 2, 2026

ఖమ్మం: GOOD NEWS.. విదేశాల్లో ఉద్యోగ అవకాశం!

image

ఉమ్మడి జిల్లాలోని నిర్మాణ కార్మికులకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు లేబర్ డీఎల్సీ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. ఎనిమిదో తరగతి ఉత్తీర్ణతతో పాటు 18-30 ఏళ్ల లోపు ఉన్న వారికి ఉచిత శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామన్నారు. తాపీ, ఎలక్ట్రికల్, వెల్డింగ్ రంగాల్లో ఆసక్తి ఉన్నవారు సమీప కార్మిక శాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

News April 2, 2026

జీవీఎంసీ వార్డుల విభజన ప్రారంభం

image

విశాఖలో జీవీఎంసీ ఎన్నికల దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. 98 వార్డులను 120కి పెంచుతూ, 2011 జనాభా లెక్కల ఆధారంగా విభజన ప్రక్రియ మొదలైంది. ఈనెల 9లోగా ప్రక్రియ పూర్తి చేసి, మే 5లోగా గెజిట్ విడుదల చేయనున్నారు. ఒక్కో వార్డుకు సగటున 15,840 జనాభా ఉండగా, 10% వరకు అటూ ఇటూగా మార్పులకు అవకాశం ఉంది. ప్రజల అభ్యంతరాల తర్వాత ఫైనల్ డ్రాఫ్ట్ ఆమోదం పొందనుంది. ఎన్నికలు ఆరు నెలల్లో జరిగే అవకాశం ఉంది.