News April 14, 2025
నిర్మల్ జిల్లాలో యాక్సిడెంట్.. ఒకరు స్పాట్ డెడ్

భైంసా-పార్డి(బి) రోడ్డుపై కారు బోల్తా పడి ఒకరు స్పాట్లో మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు నిర్మల్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇద్దరు కూడా ఫొటోగ్రాఫర్లుగా తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. కారు అదుపుతప్పి బోల్తా పడిందా.. లేదా ఇతర కారణాలతో జరిగిందా అని పోలీసులు పరిశీలిస్తున్నారు.
Similar News
News January 28, 2026
UK ప్రధానులే లక్ష్యంగా చైనా ఆపరేషన్ ‘సాల్ట్ టైఫూన్’!

బ్రిటన్ రాజకీయాల్లో చైనా హ్యాకర్లు కలకలం రేపారు. ఏకంగా ముగ్గురు మాజీ PMలు బోరిస్, సునక్, లిజ్ ట్రస్‌కు క్లోజ్‌గా ఉన్న అధికారుల ఫోన్లను హ్యాక్ చేసినట్లు ‘ది టెలిగ్రాఫ్’ పేర్కొంది. ఆపరేషన్ ‘సాల్ట్ టైఫూన్’ పేరుతో 2021-2024 వరకు ఈ గూఢచర్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఇది కొనసాగుతోందన్న అనుమానాలున్నాయి. ఏకంగా ప్రధాని నివాసంలోకే చైనా హ్యాకర్లు చొరబడ్డారని అక్కడి మీడియా కోడై కూస్తోంది.
News January 28, 2026
NGKL: కాటన్ మిల్లులో గంజాయి కలకలం.. ఇద్దరు అరెస్ట్!

NGKL జిల్లా ఊర్కొండ మండలంలోని సూర్యాలత కాటన్ మిల్లులో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఒడిశాకి చెందిన ఇద్దరు వ్యక్తులు గంజాయితో పట్టుబడ్డారు. వారి నుంచి సుమారు కిలోకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
News January 28, 2026
బాఫ్టా రేసులో మన ‘బూంగ్’.. మణిపురీ మ్యాజిక్!

ఫర్హాన్ అక్తర్ నిర్మించిన మణిపురీ చిత్రం ‘Boong’ ప్రతిష్ఠాత్మక BAFTA 2026 నామినేషన్లలో చోటు సంపాదించింది. లక్ష్మీప్రియా దేవి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ‘బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్’ కేటగిరీలో పోటీ పడుతోంది. మణిపుర్ నేపథ్యంతో సాగే ఓ బాలుడి కథతో తీసిన ఈ మూవీ ఇప్పటికే అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో రచ్చ చేస్తోంది. గ్లోబల్ స్టేజ్‌పై ఇండియన్ రీజినల్ సినిమా ఇలా మెరవడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


