News April 11, 2025

నిర్మల్ జిల్లాలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం భైంసా మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. భైంసా పట్టణం గోపాల్‌నగర్‌కు చెందిన బోయిడోళ్ల రాజు (32) వానల్పాడ్ నుంచి నడుచుకుంటూ తిమ్మాపూర్ వైపు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొంది. తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Similar News

News January 30, 2026

గద్వాల: అక్రమ మద్యంపై పోలీసుల దాడులు.. 29 మంది బైండోవర్

image

మున్సిపల్ ఎన్నికల వేళ జిల్లాలో అక్రమ మద్యంపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. గద్వాల టౌన్, అయిజ, శాంతినగర్ పరిధిలో 31.05 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా 29 మందిని బైండోవర్ చేశామన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

News January 30, 2026

ఫ్యూచర్ ట్రేడింగ్.. వెండి, గోల్డ్ రేటు భారీ పతనం

image

విపరీతంగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు ఇవాళ <<19003989>>పతనమయ్యాయి<<>>. ఇది క్రమంగా కొనసాగే అవకాశం ఉందని నిపుణుల అంచనా. ఫ్యూచర్ ట్రేడింగ్‌(MAR)లో KG వెండి రేటు ₹67,891 తగ్గి(16.97%) ₹3.32 లక్షలకు చేరింది. గోల్డ్ కూడా(FEB) 10 గ్రాములు ₹15,246 తగ్గి(9%) ₹1,54,157 పలికింది.
* భవిష్యత్తులో ఓ తేదీన ముందుగా నిర్ణయించిన ధరకు స్టాక్స్/కమోడిటీల కొనుగోలు లేదా విక్రయానికి చేసుకునే ఒప్పందాన్ని ఫ్యూచర్ ట్రేడింగ్ అంటారు.

News January 30, 2026

అంతర్వేదిలో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

image

అంతర్వేది PNM కాలనీ మెయిన్ రోడ్డుపై శుక్రవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రావులపాలెం, కొత్తపేట ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువకులు బైక్ పై అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చారని స్థానికులు తెలిపారు. తిరిగి వెళుతుండగా పశువులను ఢీ కొట్టి ప్రమాదానికి గురయ్యారన్నారు.