News December 20, 2025

నిర్మల్‌ జిల్లాలో రూ.14,67,700 సీజ్: ఎస్పీ

image

జిల్లాలో మూడు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. జిల్లా సరిహద్దుల్లోని 12 చెక్‌పోస్టుల వద్ద నిర్వహించిన తనిఖీల్లో సరైన పత్రాలు లేని రూ.14,67,700 నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నగదుతో పాటు రూ.7లక్షల విలువైన మద్యం పట్టుబడగా.. గత ఎన్నికల్లో ఘర్షణలకు పాల్పడిన 150 కేసుల్లో 201 మందిని బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News December 23, 2025

తిరుపతి కలెక్టరేట్‌లో ముందస్తు క్రిస్మస్ వేడుకలు

image

తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో ప్రీ-క్రిస్మస్ వేడుకలు మంగళవారం నిర్వహించారు. కలెక్టర్ వెంకటేశ్వర్లు, జాయింట్ కలెక్టర్ మౌర్య, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు. పాస్టర్లు సతీష్, మార్టిన్, అరుళ్ అరసు, వేదనాయకం సహా పలువురు ప్రార్థనలు నిర్వహించారు. ప్రేమ, శాంతి, సామరస్యంతో సమాజంలో ముందుకు సాగాలని సందేశమిచ్చారు.

News December 23, 2025

OFFICIAL: వారణాసిలో నటిస్తున్న ప్రకాశ్ రాజ్

image

మహేశ్-రాజమౌళి కాంబోలో వస్తున్న ‘వారణాసి’ చిత్రంలో విలక్షణ నటుడు <<18570987>>ప్రకాశ్ రాజ్<<>> నటిస్తున్నారంటూ గాసిప్స్ వైరలైన విషయం తెలిసిందే. తాను వారణాసి చిత్రంలో నటిస్తున్నట్లు ఇప్పుడు స్వయంగా ప్రకాశ్ రాజ్ వెల్లడించారు. ‘వారణాసి షూటింగ్‌లో అద్భుతమైన షెడ్యూల్ ముగిసింది. రాజమౌళి, మహేశ్, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంకా చోప్రాకు థాంక్స్. తర్వాతి షెడ్యూల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.

News December 23, 2025

KNR: ‘ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి’

image

KNR జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో పోలీస్, రవాణా, ఆర్ అండ్ బీ, వైద్యారోగ్య శాఖల అధికారులతో రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. తరచుగా ప్రమాదాలు జరిగే ‘బ్లాక్ స్పాట్’లను గుర్తించి, అక్కడ ప్రాణ నష్టం జరగకుండా తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.