News February 25, 2026
నిర్మల్ జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు నిషేధం

జిల్లాలో స్కానింగ్ కేంద్రాలు, రోగ నిర్ధారణ కేంద్రాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని వైద్యశాఖ అధికారులను కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే వారిపై పీసీ, పీఎన్‌డీటీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అనధికార ఆర్‌ఎంపీలను గుర్తించి, ప్రథమ చికిత్సకు మించి చికిత్సలు చేయకుండా నియంత్రించాలని సూచించారు.
Similar News
News February 26, 2026
జిల్లాలో 20 కేంద్రాల్లో NEETపరీక్షలు: GNT కలెక్టర్

గుంటూరు జిల్లాలో 20 కేంద్రాల్లో NEETపరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. మే 3న నిర్వహించే నీట్ పరీక్షకు జిల్లాలో గుంటూరు, తెనాలి, మంగళగిరి, అమరావతిలో 20 కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు. గురువారం న్యూ ఢిల్లీ నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు.
News February 26, 2026
విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల సౌకర్యార్ధం విజయవాడ మీదుగా కాన్పూర్ సెంట్రల్(CNB)- మధురై(MDU) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.01927 CNB- MDU రైలు వచ్చే నెల 25 వరకు ప్రతి బుధవారం, నం.09128 MDU- CNB రైలు ఈ నెల 27 నుంచి వచ్చే నెల 27 వరకు ప్రతి శుక్రవారం ప్రయాణిస్తాయన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని తాజాగా ప్రకటన విడుదల చేశారు.
News February 26, 2026
పార్వతీపురం: ‘వాహనాలకు ఎల్ఈడీ లైట్లు ఉపయోగించకూడదు’

రవాణా శాఖ పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు ఎల్ఈడీ లైట్లు ఉపయోగించకూడదని కలెక్టర్ ప్రభాకర రెడ్డి సూచించారు. గురువారం పార్వతీపురం కలెక్టరేట్లో రవాణా శాఖ అధికారులతో సమావేశంలో నిర్వహించారు. రోడ్డు భద్రతా వారోత్సవాలు ప్రజల్లో అవగాహన పెంపొందించేలా రూపొందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రమాదకర మలుపుల్లో గుర్తింపు చిహ్నాలను ఏర్పాటు చేయాలన్నారు.


