News January 13, 2026

నిర్మల్ జిల్లాలో లేగదూడపై చిరుత దాడి

image

నిర్మల్ జిల్లా తానురు మండలం బెంబేరా శివారులో పాడేకర్ దేవన్నకు చెందిన లేగదూడపై చిరుత పులి దాడి చేసి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి పశువుల పాకలో దూడను కట్టి ఇంటికెళ్లానని, ఈరోజు ఉదయం వచ్చి చూడగా మరణించిందని రైతు తెలిపాడు. రాత్రి పూట చిరుతపులి వచ్చి దాడి చేసి చంపేసిందని వెల్లడించాడు. దీంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Similar News

News February 4, 2026

NCERTలో 117 ఉద్యోగాలు

image

NCERT 117 అకడమిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PG, M.LSc, NET/SET/SLET, PhD/M.Phil అర్హతతో పాటు అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.1000. ప్రొఫెసర్‌కు నెలకు రూ.1,44,200, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,31,400, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ లైబ్రేరియన్‌కు రూ.57,700 చెల్లిస్తారు. అర్హులు FEB 20 వరకు అప్లై చేయొచ్చు. మరిన్ని వివరాలకు www.ncert.nic.in చూడండి.

News February 4, 2026

MGU: బ్యాక్‌లాగ్ విద్యార్థులకు ‘చివరి అవకాశం’

image

మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో 2011-12 నుంచి 2015-16 వరకు చదివిన బ్యాక్‌లాగ్ విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు చివరి అవకాశం కల్పించారు. అపరాధ రుసుము లేకుండా మార్చి 4 వరకు, రూ.100 ఆలస్య రుసుముతో మార్చి 6 వరకు ఫీజు చెల్లించవచ్చని ఎగ్జామినేషన్ కంట్రోలర్ డా.ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఈ బ్యాక్‌లాగ్ విద్యార్థులు తమ పెండింగ్ పేపర్లు క్లియర్ చేసుకునేందుకు ఇది మంచి అవకాశమన్నారు.

News February 4, 2026

మహబూబ్‌నగర్: అభ్యర్థులకు ఎన్నికల ఖర్చులపై అవగాహన సదస్సు

image

మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల వ్యయంపై అవగాహన కల్పించనున్నట్లు కమిషనర్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు పట్టణంలోని అంబేడ్కర్ కళాభవనంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. నామినేషన్ దాఖలు చేసిన ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా హాజరుకావాలని, ప్రచార ఖర్చుల వివరాల నమోదుపై కీలక సూచనలు చేస్తామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.