News March 20, 2025
నిర్మల్ జిల్లాలో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

నిర్మల్ జిల్లాలో మూడ్రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు గాలులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గినా.. తర్వాత మళ్లీ పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఎండవేడితో అల్లాడుతున్న ప్రజలకు ఇది కాస్త ఉపశమనం కలగనుంది. పంటలకు నష్టం జరిగే అవకాశం ఉందని రైతన్న ఆందోళన చెందుతున్నారు. రైతులు పంటలను సంరక్షిచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News December 13, 2025
వెల్టూర్: ఓటర్ల కాళ్లు మొక్కిన అభ్యర్థి

వెల్టూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి బూషిరాజ్ మల్లయ్య ఇంటింటికీ తిరిగి ఓటర్ల కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ప్రజాసేవకు సర్వం కోల్పోయానని, ఉన్న ఆరు ఎకరాల భూమి కూడా అమ్ముకున్నానని చెబుతున్నారు. ఆడబిడ్డలు కలిగిన నేతను, ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లను వేడుకుంటున్నారు. ప్రచారంలో మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
News December 13, 2025
తూ.గో. జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం తనిఖీ చేసిన SP

తూ.గో. జిల్లా పోలీసు శిక్షణ కేంద్రాన్ని SP డి.నరసింహ కిషోర్ శనివారం సందర్శించారు. త్వరలో స్టైపెండరీ క్యాడేట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పోలీస్ శిక్షణ కేంద్రంలో మౌలిక వసతుల కల్పన పనులు ఏవిధంగా జరుగుతున్నాయో పరిశీలించారు. ఎటువంటి అంతరాయం లేకుండా పనులు వేగవంతం కావాలని ఆయన ఆదేశించారు. తాగునీరు, వైద్య సదుపాయాలు, పరిశుభ్రతపై దృష్టి పెట్టాలన్నారు.
News December 13, 2025
ర్యాలీకి పోలీసులు సహకరించాలి: దేవినేని అవినాశ్

ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించడం కొనసాగుతుందని, జిల్లా YCP అధ్యక్షుడు దేవినేని అవినాశ్ అన్నారు. అక్టోబర్ 10 నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నామని, NTR జిల్లాలో 4.22 లక్షలకు పైగా సంతకాలు వచ్చాయన్నారు. ఈ సంతకాలను కేంద్ర కార్యాలయానికి 15వ తేదీన ర్యాలీగా పంపిస్తామని, YCP నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ర్యాలీకి పోలీసులు సహకరించాలని కోరారు.


