News April 11, 2025
నిర్మల్ జిల్లాలో 1 మి.మీ వర్షపాతం

నిర్మల్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో సగటున 1 మిల్లీమీటర్ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. లోకేశ్వరంలో అత్యధికంగా 7 మి.మీ, సారంగాపూర్ 4.2, దిలావర్పూర్ 0.6, నర్సాపూర్ (జి) 2.0, బాసర 3.4, తానూర్ 1.4, ముధోల్ 0.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Similar News
News April 18, 2025
వైసీపీ హయాంలో అభివృద్ధి కుంటుపడింది: విశాఖ ఎంపీ

వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి కుంటుపడిందని విశాఖ ఎంపీ శ్రీభరత్ విమర్శించారు. శుక్రవారం విశాఖ జిల్లా టీడీపీ ఆఫీసులో ఆయన మాట్లాడారు. వైసీపీ హయాంలో విశాఖలో 33 ప్రభుత్వ ఆస్తులు తాకట్టుపెట్టి అప్పులు తెచ్చారని, రుషికొండ ప్యాలెస్‌కు రూ.450కోట్లు YCPప్రభుత్వం ఖర్చుపెట్టిందని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం భోగాపురం ఎయిర్‌పోర్టుకు రోడ్డు కనెక్టివిటీ, విశాఖలో TCSకు ప్రతిపాదనలు చేశామన్నారు.
News April 18, 2025
గుడివాడలో విజయవాడ యువకుడి వీరంగం

గుడివాడలో విజయవాడ యువకుడు వీరంగం సృష్టించాడు. స్థానికులు తెలిపిన సమాచార ప్రకారం విజయవాడలో మాచవరానికి చెందిన సాయి గుడివాడ వెళ్లి దుర్గాప్రసాద్‌పై శుక్రవారం బ్లేడుతో దాడి చేసి గాయపరిచాడు. గాయాలపాలైన దుర్గాప్రసాద్‌ను స్థానికులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా సాయిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
News April 18, 2025
ప్రజాస్వామ్య పద్ధతిలో సంస్థాగత ఎన్నికలు: ఎంపీ శ్రీభరత్

T.D.P. సంస్థాగత ఎన్నికల్లో అందరి అభిప్రాయాలు తీసుకుని కమిటీలను ఎన్నుకోవాలని విశాఖ ఎంపీ శ్రీ భరత్ సూచించారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏకాభిప్రాయం కుదరకపోతే జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జి దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ రామారావు తదితరులు పాల్గొన్నారు.