News February 25, 2025

నిర్మల్ జిల్లాలో 19,107 ఎమ్మెల్సీ ఓటర్లు

image

ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో మొత్తం 46 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మొత్తం 19,107 మంది ఓట్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారిలో 17,141 మంది పట్టభద్రులు, 1,966 మంది ఉపాధ్యాయులు ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఓటరు గుర్తింపు స్లిప్పుల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైందని, ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

Similar News

News November 9, 2025

HYD: సైబర్ నేరాల బాధితులు ఫిర్యాదు చేయండి: సీపీ

image

నగరంలో రోజూ రూ.కోట్ల విలువైన సైబర్ నేరాలు జరుగుతున్నాయని సీపీ సజ్జనార్ తెలిపారు. పెట్టుబడుల పేరుతో చాలా యాప్‌లలో ప్రజలు మోసపోతున్నారని, డబ్బు ఊరికే రాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. APK ఫైల్స్ ద్వారా మోసాలు జరుగుతున్నాయని వివరించారు. సైబర్ నేరాల్లో డబ్బు పోగొట్టుకున్న వెంటనే బాధితులు 1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.

News November 9, 2025

ఎండల మల్లన్నను దర్శించుకున్న ఎస్పీ

image

టెక్కలి మండలం రావివలస శ్రీ ఎండల మల్లిఖార్జున స్వామివారిని ఆదివారం సాయంత్రం ఎస్పీ కె.వి మహేశ్వరరెడ్డి దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ ఈఓ గురునాథ రావు ఆలయ విశిష్టతను వివరించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. సోమవారం కార్తీకమాసం ఉత్సవం సందర్భంగా భద్రత చర్యలు పటిష్ఠంగా చేపట్టాలని అధికారులకు ఎస్పీ సూచించారు.

News November 9, 2025

కమీషన్ల కోసమే మేడారంలో కాలయాపన: నాగజ్యోతి

image

మేడారం జాతరకు మరో 70 రోజులే గడువు ఉన్నప్పటికీ పనులు ఇంకా పునాది దశలోనే ఉన్నాయని బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. కమీషన్ల కోసమే అధికారులు పనుల్లో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. పచ్చని మేడారాన్ని ఎడారిలా మార్చేశారని, షాపులు కోల్పోయిన వ్యాపారులకు తక్షణమే ప్రత్యామ్నాయం చూపించాలని ఆమె డిమాండ్ చేశారు.