News April 8, 2026

నిర్మల్ జిల్లా జడ్పీ సీఈవోగా భాగ్యలక్ష్మి

image

నిర్మల్ జిల్లా జడ్పీ సీఈవోగా భాగ్యలక్ష్మిని నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిద్దిపేట జిల్లా డిప్యూటీ సీఈవోగా విధులు నిర్వహిస్తున్న భాగ్యలక్ష్మిని నిర్మల్ జిల్లా సీఈవోగా పదోన్నతి కల్పించింది. ప్రస్తుతం ఇన్‌ఛార్జ్ జడ్పీ సీఈవోగా శంకర్ విధులు నిర్వహిస్తున్నారు. భాగ్యలక్ష్మి గురువారం బాధ్యతలు చేపట్టనున్నారు.

Similar News

News April 12, 2026

HYD: ఇంటర్ పాసైన విద్యార్ధులకు రూ.లక్ష వరకు SCHOLARSHIP

image

నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు కంప్యూటర్ ఎడ్యుకేషన్ మెరిట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రాం కింద వివిధ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కోర్సులు ఆన్‌లైన్‌లో నేర్చుకునేందుకు రూ.లక్ష వరకు కోర్సు ఫీజులో రాయితీ ఇస్తున్నట్లు అకాడమీ డైరెక్టర్ అడప వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ మార్క్స్ గ్రేడింగ్ ఆధారంగా రూ.లక్ష వరకు స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. SHARE IT.

News April 12, 2026

సంతానం కోసం 6వేల మైళ్ల ప్రయాణం!

image

యురోపియన్ ఈల్స్(చేపలు) సంతానోత్పత్తి ఓ అంతుచిక్కని మిస్టరీ. ఇవి ఐరోపా నదుల నుంచి 6వేల మైళ్లు ప్రయాణించి అట్లాంటిక్ మహాసముద్రంలోని ‘సర్గాసో సముద్రం’లో మాత్రమే గుడ్లు పెడతాయి. పుట్టిన తర్వాత పిల్ల చేపలు కూడా దారి తెలియకపోయినా తిరిగి తమ పూర్వీకులు నివసించిన నదులకే వస్తాయి. ఇదెలా సాధ్యమవుతోందని శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో(44/100)

News April 12, 2026

కృష్ణా: బందరు TDP-JSP కూటమి కోటకు బీటలు

image

మచిలీపట్నంలో JSP కార్యకర్త ఇంటి కూల్చివేత, అనంతరం MP బాలశౌరి జోక్యంతో మంత్రి కొల్లు, JSP నేతల మధ్య దూరం పెరిగింది. కొద్దిరోజులుగా మంత్రి నిర్వహిస్తున్న కార్యక్రమాలకు JSP శ్రేణులు, స్థానిక ఇన్‌ఛార్జ్ బండి రామకృష్ణ దూరంగా ఉంటున్నారు. 30% కోటా అమలు చేయడం లేదని, తమను విస్మరిస్తున్నారని JSP నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫూలే జయంతిని కూడా వేరువేరుగా నిర్వహించడం ఈ విభేదాలకు నిదర్శనంగా మారింది.