News March 5, 2025
నిర్మల్: జిల్లా నేతలకు దిశా నిర్దేశం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది నియోజకవర్గాలలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించుకుని ముందుకు వెళ్దామని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో నిర్వహించిన అంతర్గత పార్టీ సమావేశంలో జిల్లా నాయకులకు ఆమె దిశానిర్దేశం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తదితరులున్నారు.
Similar News
News March 6, 2025
బస్సును ఓవర్ టేక్ చేయబోయి యువకుడి దుర్మరణం

నంద్యాల జిల్లా ఆత్మకూరులో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో సతీశ్ అనే యువకుడు దుర్మరణం చెందాడు. పట్టణంలోని గొల్లపేటకు చెందిన సతీశ్.. ఓ ప్రైవేట్ సంస్థలో కొరియర్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం ఆత్మకూరులోని కేజీ రోడ్డుపై వెళ్తుండగా ఎదురుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో వెనక వస్తున్న బొలెరో వాహనం తగిలింది. తీవ్రంగా గాయపడిన సతీశ్.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
News March 6, 2025
అనకాపల్లి: చీమల మందు తాగిన అంగన్వాడీ కార్యకర్త

కె.కోటపాడు మండలం పోతనవలస అంగన్వాడీ కార్యకర్త రొంగలి నూకరత్నం గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఐసీడీఎస్ సీడీపీఓ, సూపర్వైజర్ వేధింపులు తాళలేక ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు సీఐటీయూ నాయకులు ఆరోపించారు. ప్రస్తుతం ఆమె కె.కోటపాడు సి.హెచ్.సిలో చికిత్స పొందుతుంది. తనిఖీల పేరుతో వేధింపులకు గురి చేయడంతోనే నూకరత్నం చీమల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని, సీఐటీయూ నాయకులు తెలిపారు.
News March 6, 2025
సిద్దిపేట: MLC కౌంటింగ్.. 60 గంటలు సాగింది

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో BJP అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందిన సంగతి తెలిసిందే. కాగా కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది. ఈనెల 3న ఉ. 8 గంటలకు చెల్లుబాటయ్యే ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్లను వేరు చేయడం మెుదలు పెట్టగా మంగళవారం ఉ. 10 గంటల వరకు ఈ ప్రక్రియ సాగింది. 11 గంటలకు అభ్యర్థులకు పోలైన ఫస్ట్ ప్రయార్టీ ఓట్ల లెక్కింపు స్టార్ట్ చేయగా బుధవారం 8 గంటలకు అంటే సుమారు 60 గంటల వరకు సాగింది.