News March 13, 2025
నిర్మల్ జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పండుగను సంతోషాల నడుమ జరుపుకోవాలని కోరారు. సహజ రంగులను వాడాలని సూచించారు. బైక్‌లపై వేగంగా వెళ్లవద్దని, యువత ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు.
Similar News
News March 13, 2025
బిగ్ స్కామ్: Blinkitను గుడ్డిగా నమ్మవద్దంటున్న యూజర్

కస్టమర్లను Blinkit మోసగిస్తోందని ఓ యూజర్ Redditలో పోస్టు పెట్టారు. తాను అరకిలో ద్రాక్షపళ్లను ఆర్డర్ చేస్తే కేవలం 370గ్రా. డెలివరీ చేసిందన్నారు. డౌటొచ్చి మరోసారి ఆర్డర్ చేస్తే మళ్లీ ప్యాకేజ్‌తో సహా 370గ్రా. తూకమే ఉందని పేర్కొన్నారు. ఇదో పెద్ద స్కామ్ అని, ఆర్డర్ చేసినవి కాకుండా నాణ్యత లేని పండ్లు, కూరగాయాలు పంపిస్తోందని ఆరోపించారు. తమకూ ఇలాగే జరిగిందని యూజర్లు రిప్లై ఇచ్చారు. మీకూ ఇలాగే జరిగిందా?
News March 13, 2025
పెద్దపల్లి: ఉచిత డ్రైవింగ్ కోర్సులో శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ హకీంపేట నుండి ఉచిత డ్రైవింగ్ కోర్సులో శిక్షణ కోసం ఆసక్తి గల బీసీ యువతీ యువకులు దరఖాస్తులను మార్చి 31లోపు సమర్పించాలని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హెవీ మోటార్ వాహనం, తేలికపాటి మోటార్ వాహనం డ్రైవింగ్ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ఈనెల 31లోగ ఆసక్తిగల వారు జిల్లా బీసీ అధికారి కార్యాలయంలో సమార్పించాలన్నారు.
News March 13, 2025
పెద్దపల్లి: సెలవు దినాల్లో కూడా పన్నులు చెల్లించవచ్చు: అదనపు కలెక్టర్

సెలవు దినాల్లో కూడా పన్నులు చెల్లించవచ్చని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్నులు మార్చి 31వ తేదీలోపు చెల్లిస్తే రాయితీ ఉంటుందని అన్నారు. మీసేవా, అధికారులు, డిజిటల్ పేమెంట్ ద్వారా కూడా పన్నులు చెల్లించవచ్చన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.